News August 22, 2025

FLASH: శామీర్‌పేట్ చెరువులో యువకుడి మృతదేహం కలకలం

image

శామీర్‌పేట్ పెద్ద చెరువులో పడి ఒక వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చెరువులో ఓ వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని వెలికితీశారు. మృతుడు చెరుకూరి రసూల్(25)గా గుర్తించామని తెలిపారు. మృతుడు మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ వద్ద నివాసం ఉంటున్నట్లు చెప్పారు.

Similar News

News August 22, 2025

గడువులోగా మిల్లింగ్ పూర్తి చేయాలి: కామారెడ్డి కలెక్టర్

image

మిల్లర్లు సీఎమ్ఆర్ డెలివరీ త్వరితగతిన పూర్తి చేసి ఇవ్వాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ సూచించారు. శుక్రవారం ఐడీఓసీ హాల్‌లో మిల్లర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ 2024-25కు సంబంధించి సెప్టెంబర్ 12లోపు సీఎంఆర్ డెలివరీ పూర్తి చేయాలన్నారు. సీఎంఆర్ డెలివరీ చేయని మిల్లులపై చర్యలు తీసుకుంటామని, 100% డెలివరీ చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.

News August 22, 2025

BREAKING: DSC మెరిట్ జాబితా విడుదల

image

AP: మెగా DSC మెరిట్ జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు ఈ వివరాలను అధికారిక <>వెబ్‌సైట్‌<<>> నుంచే పొందాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ‘జోన్ ఆఫ్ కన్సిడరేషన్’లోకి వచ్చిన అభ్యర్థులకు వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందుతుందని తెలిపారు. PGT, SGT, SAలు ఇలా అన్ని విభాగాల మెరిట్ లిస్ట్ వన్ బై వన్ రిలీజ్ అవుతున్నాయని డీఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు.

News August 22, 2025

పనుల జాతరలో అదనపు కలెక్టర్ నగేష్

image

పనుల జాతరను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. శుక్రవారం హవేలిగణపూర్ మండలం చౌట్లపల్లిలో పనుల జాతర నిర్వహించారు. మండల స్పెషల్ ఆఫీసర్ విజయ లక్ష్మి, ఎంపీడీఓ ఏపీఓ, గ్రామస్థులు పాల్గొన్నారు. ఆసక్తి గల లబ్దిదారులు పశువుల కొట్టాలు, వ్యక్తిగత సోక్ పిట్‌ల కోసం దరఖాస్తులను అందజేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు(నరేగ) పనుల జాతరలో అర్హులైన వారందరూ తప్పనిసరిగా పాల్గొనాలన్నారు.