News October 24, 2025

FLASH: సిద్దిపేట జిల్లాలో యాక్సిడెంట్

image

ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొని యువకుడు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన యువకుడు(29) బైక్‌పై వస్తున్నాడు. బెజ్జంకి క్రాసింగ్ దగ్గర రాజీవ్ రహదారిపైకి రాగానే హైదరాబాద్ వైపు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనకాల నుంచి వేగంగా ఢీకొట్టి చనిపోయాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 24, 2025

కుబీర్: సోయ యంత్రంలో చిక్కుకొని వ్యక్తి మృతి

image

సోయ యంత్రంలో చిక్కుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన కుబీర్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ సావ్లి గ్రామానికి చెందిన గట్టేవార్ సోమనాథ్ (34) సోయపంట పడుతూ ఉండగా ప్రమాదవశాత్తు సోయ యంత్రంలో చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా సోమనాథ్ మృతి చెందినట్లు తెలిపారు.

News October 24, 2025

సూపర్ ఫిట్‌గా శర్వానంద్

image

టాలీవుడ్ హీరో శర్వానంద్ కొత్త లుక్‌లో అదరగొడుతున్నారు. సన్నగా మారిపోయి, సడన్‌గా చూస్తే గుర్తుపట్టలేనంతగా ట్రాన్స్‌ఫామ్ అయ్యారు. శర్వానంద్ ప్రస్తుతం ‘బైకర్’ అనే స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ మూవీలో నటిస్తుండగా, సినిమాలో పాత్ర కోసం సిక్స్ ప్యాక్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో కాస్త బొద్దుగా ఉన్న ఆయన సూపర్ ఫిట్‌గా మారిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. శర్వానంద్ కొత్త లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.

News October 24, 2025

జగిత్యాల: 100% ఉత్తీర్ణత లక్ష్యం

image

జగిత్యాల జిల్లాలో పదో తరగతి 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ శుక్రవారం స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఏంఈవో, ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, సాయంత్రం తరగతులు, సిలబస్ పూర్తి, తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాలు, నాణ్యతపూర్వక బోధన ద్వారా 100% ఉత్తీర్ణత సాధించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.