News October 12, 2025

FLASH: సిద్దిపేట: రిపోర్టర్ ఆత్మహత్య

image

సిద్దిపేట జిల్లా కోహెడలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన వేల్పుల సంపత్ ఓ ప్రముఖ పత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. 6 రోజుల క్రితం కుటుంబ ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు యత్నించాడు. మెరుగైన వైద్య చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు.

Similar News

News October 12, 2025

గుంటూరు జిల్లాలో ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్‌లు

image

@ కలెక్టర్ తమీమ్ అన్సారియా: 9849904002.
@ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ: 9849904003.
@ గుంటూరు IG సర్వ శ్రేష్ట త్రిపాటి: 9440627241.
@ SP వకుల్ జిందాల్: 8688831300.
@ ASP అడ్మిన్: 8688831302.
@ DMHO విజయలక్ష్మీ: 9849902337.
@ DEO రేణుక: 9849909107.
@ DFO: 9949991062.
@ DTC: 9154294107.
@ గుంటూరు RTC RM: 9959225412.
@ Lost Cellphone Whatsapp:8688831574.

News October 12, 2025

‘పార్టీని బలోపేతం చేసే దిశగా DCC అధ్యక్షుల నియామకం’

image

కాంగ్రెస్ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. అందరి అభిప్రాయాలు, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని, జిల్లా అధ్యక్షుడి ఎంపిక త్వరలో పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు.

News October 12, 2025

HYD: రూ.కోట్ల అద్దె ఎగ్గొడుతున్నప్పటికీ.. నోటీసులేనా?

image

HMDA పరిధిలో రూ.కోట్ల పాయల అద్దెలు ఎగ్గొడుతున్నప్పటికీ HMDA సరిగ్గా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, సంజీవ పార్క్ తదితర ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక సంస్థలు ఇప్పటి వరకు అద్దె చెల్లించలేదు. కోట్ల బకాయిలు ఉన్నాయి. HMDA మాత్రం నోటీసులకు మాత్రమే పరిమితమవుతుంది.