News July 3, 2024
FLASH.. సిరిసిల్లలో విషాదం.. చేనేత కార్మికుడు ఆత్మహత్య

సిరిసిల్లలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. సిరిసిల్లో నివాసం ఉండే చేనేత కార్మికుడు యాదగిరి(48) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిరిసల్ల పట్టణంలో మంగళవారం రాత్రి జరిగింది. 6 నెలలుగా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 10, 2026
KNR: పోలింగ్ రోజున పబ్లిక్ హాలిడే

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ నిర్వహించే కేంద్రాల్లో ఈనెల 10, 11 తేదీల్లో పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు సెలవు ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాలుగా ఉన్న విద్యా సంస్థలు, కార్యాలయాలకు ఈ సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. చట్ట ప్రకారం ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ రోజున ఈనెల 11న సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు.
News February 10, 2026
KNR: నేటి నుంచే ‘సైలెన్స్ పీరియడ్’

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా జిల్లాలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వచ్చినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ 48 గంటల ‘సైలెన్స్ పీరియడ్’లో అభ్యర్థులు ఎలాంటి బహిరంగ సభలు, ప్రదర్శనలు నిర్వహించరాదని హెచ్చరించారు.
News February 9, 2026
KNR: పాఠశాలను సందర్శించిన అడిషనల్ కలెక్టర్

తిమ్మాపూర్ మండలంలోని, మండల ప్రాథమిక పాఠశాల నుస్తులాపూర్ పాఠశాలను అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మూడవ తరగతి విద్యార్థుల FLS సామర్ధ్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులు మొత్తం FLS సామర్ధ్యాలు సాధించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలోని అంగన్వాడీ కేంద్రంలో వివిధ రికార్డులు తనిఖీ చేశారు.


