News December 8, 2025
FLASH: సూర్యాపేట: నకిలీ బంగారం ముఠా ARREST

తక్కువ ధరకు బంగారం ఆశ చూపి ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టును సూర్యాపేట పోలీసులు రట్టు చేశారు. హనుమకొండకు చెందిన వెంకటేశ్వర రావు నుంచి రూ.12 లక్షలు తీసుకుని నకిలీ బంగారం అంటగట్టినట్లు ఎస్పీ నరసింహ ఐపీఎస్ తెలిపారు. ఈ మోసంలో నలుగురు నిందితులు (నరేశ్, ఆదినారాయణ, యోగిరెడ్డి, నాగిరెడ్డి) అరెస్టు అయ్యారు. నకిలీ బంగారాల ప్రకటనలను నమ్మవద్దని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Similar News
News December 8, 2025
GNT: అమృత హెల్త్ కార్డులు అందజేసిన కలెక్టర్

ప్రభుత్వ గుర్తింపు పొందిన అనాథాశ్రమాల్లో నివసిస్తున్న అనాథ పిల్లల సంక్షేమం కోసం ఎన్టీఆర్ వైద్యసేవ/అమృత హెల్త్ స్కీమ్ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం అమృత హెల్త్ కార్డులను కలెక్టర్ చిన్నారులకు అందజేశారు. 39 మంది లబ్దిదారులకు ప్రత్యేక అమృత హెల్త్ కార్డులు పంపిణీ చేశామన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ నెట్వర్క్ ఆసుపత్రుల్లో చిన్నారులు వైద్యం పొందవచ్చన్నారు.
News December 8, 2025
సత్యసాయి: పల్స్ పోలియో గోడ పత్రికల విడుదల

డిసెంబర్ 21వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్‌లో ఆయన గోడ పత్రికలను విడుదల చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో 0-5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని అధికారులకు తెలిపారు. 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది ప్రతి ఇంటి వద్దకు వెళ్లి పోలియో చుక్కలు తప్పనిసరిగా వెయ్యాలన్నారు.
News December 8, 2025
పోలింగ్ రోజున వరంగల్‌లో స్థానిక సెలవులు: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటించినట్లు వరంగల్ కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ కార్మికులందరికీ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఓటర్లు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.


