News January 6, 2026
FLASH: హైదరాబాద్ ఘన విజయం

విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. మంగళవారం బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి బరిలోకి దిగిన HYD జట్టులో ఓపెనర్ అమన్ రావు 200* చెలరేగాడు. రాహుల్ సింగ్ (64), తిలక్ వర్మ (34) రాణించారు. 352 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగాల్ 245 పరుగులకే కుప్పకూలింది. కాగా, తిలక్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత HYD వరుసగా 2వ విజయం నమోదు చేయడం విశేషం.
Similar News
News January 25, 2026
HYD: సాగర తీర విగ్రహాల వెనుక దాగిన చరిత్ర

HYD- SECను కలిపే హుస్సేన్ సాగర్‌కు వెళ్తే వరుసగా కొలువైన 34 మంది మహనీయుల విగ్రహాలపైకి మన చూపు మళ్లక మానదు. ముందు తరాలవారికి వీరి గురించి తెలిసినా.. నేటి తరానికి అదో ప్రశ్నే. ఈ విగ్రహాలన వారి గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు. వీరు ఎవరు..? అనే సందేహం అందరి మదిలో మెదులుతోంది. ఈ మహనీయుల వీరగాథ, చరిత్ర చెప్పేందుకు Way2News రోజుక్కొక్కరి స్టోరీని సంక్షిప్తంగా అందిస్తుంది.
News January 25, 2026
HYD: నేటికీ ఊరికి దూరంగా దళితవాడ: కవయిత్రి

దేశంలో ప్రతి చోట ఊరుకు దూరంగా దళితవాడ ఉందని నేటికీ వారి పట్ల వివక్ష పోలేదని ప్రముఖ కవయిత్రి సుకీర్తరాణి అన్నారు. SVKలో విరసం 30వ మహాసభలలో ఆమె పాల్గొని మాట్లాడారు. తాను దళిత బాలికగా తీవ్రమైన వివక్షను అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో మతంతో చేసిన విధ్వంసాన్ని తన కవిత్వంలో వ్యక్తీకరించానన్నారు. సభకు ముందుగా అమరవీరుల స్థూపాన్ని మోడెం బాలకృష్ణ తల్లి మల్లమ్మ ఆవిష్కరించారు.
News January 25, 2026
HYD: ఓపెన్‌లో PG, డిప్లొమా చేయాలనుకుంటున్నారా?

ఈ ఎడాదికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో ఓపెన్ పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్‌లకు సంబంధించిన వివిధ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు దూర విద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య పద్మప్రియ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు sprtu.softelsolutions.in, www.teluguuniversity.ac.in వెబ్‌సైట్‌లో మార్చి 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని, వివరాలకు 73306 23411 ఫోన్ చేయాలన్నారు.


