News December 10, 2024
FLASH: ఆర్జీవీకి భారీ ఊరట

AP: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. చంద్రబాబు, లోకేశ్, పవన్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో న్యాయస్థానం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని ఆర్జీవీని ఆదేశించింది.
Similar News
News September 16, 2025
ఇండియా జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్?

టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్ కంపెనీ వ్యవహరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ఆ సంస్థ ఒక్కో మ్యాచుకు రూ.4.5 కోట్లు BCCIకి చెల్లించనున్నట్లు తెలుస్తోంది. 121 ద్వైపాక్షిక మ్యాచులు, 21 ఐసీసీ మ్యాచులకు కలిపి రూ.579 కోట్లకు స్పాన్సర్ హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం. 2027 వరకు స్పాన్సర్‌గా ఉండనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.
News September 16, 2025
వివేకా హత్య కేసు: బెయిల్ రద్దుపై జోక్యం చేసుకోలేమన్న SC

AP: వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి దర్యాప్తు చేయాలన్న పిటిషనర్ సునీత వాదనపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. ట్రయల్ కోర్టులో మరో పిటిషన్ వేయాలని సూచించింది. పిటిషన్ వేసిన 8 వారాల్లో మెరిట్స్ ఆధారంగా నిర్ణయం ప్రకటించాలని, ట్రయల్ కోర్టును ఆదేశించింది.
News September 16, 2025
కూతురు మృతి.. హీరో ఎమోషనల్ కామెంట్స్

చనిపోయిన తన కూతురు మీరాను మిస్సవ్వడం లేదని, ఆమె ఇంకా తనతోనే ఉన్నట్లు భావిస్తున్నానని తమిళ హీరో విజయ్ ఆంటోనీ తెలిపారు. ‘నేను కూతుర్ని కోల్పోలేదు. ఆమె నాతోనే ప్రయాణిస్తోంది. ఆమెతో రోజూ మాట్లాడుతున్నా. ఇందులో ఉన్న డెప్త్ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మీరా రెండేళ్ల క్రితం ఇంట్లో సూసైడ్ చేసుకోగా, తానూ ఆమెతోనే చనిపోయానని ఆ సమయంలో విజయ్ ఎమోషనల్ నోట్ విడుదల చేశారు.