News November 17, 2024
నెతన్యాహు ఇంటిపై ఫ్లాష్ బాంబు దాడి

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై ఫ్లాష్ బాంబుల దాడి కలకలం రేపింది. రెండు బాంబులు ఆయన ఇంటి గార్డెన్‌లో పడ్డట్లు రక్షణ మంత్రి కట్జ్ తెలిపారు. ఆ సమయంలో నెతన్యాహు, కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని వెల్లడించారు. దాడి వల్ల ఎలాంటి నష్టం జరగలేదని, ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. కాగా ఈ అటాక్ పని ఇరాన్‌దేనని భావిస్తున్నారు.
Similar News
News February 16, 2026
చంద్రబాబువి విజనరీ ఆలోచనలు: బిల్ గేట్స్

AP: తాను కలిసిన ప్రపంచ నేతలతో పోలిస్తే చంద్రబాబువి విజనరీ ఆలోచనలని బిల్ గేట్స్ కితాబిచ్చారు. ‘ఈ విషయాన్ని CBNతో జరిగిన తొలి భేటీలోనే గ్రహించాను. ఆయన ITని ప్రమోట్ చేయడం వల్లే HYD నుంచి నిపుణులు తయారయ్యారు. డిజిటల్ విప్లవంలో మోదీ, CBN కీలకపాత్ర పోషిస్తున్నారు. విద్యార్థులకు సరైన విద్యాబోధన చేయడానికి AI తోడ్పడుతుంది. వ్యవసాయంలో Ai వాడుక మంచి పరిణామం’ అని సెక్రటేరియట్‌లో జరిగిన సమావేశంలో తెలిపారు.
News February 16, 2026
TGలో మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ల ఎన్నిక UPDATES

* నిర్మల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా అప్పాల కావ్య(INC), వైస్ ఛైర్మన్‌గా అప్పాల గణేశ్ చక్రవర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ భార్యాభర్తలు.
* జగిత్యాల(D) మెట్‌పల్లి మున్సిపాలిటీ ఛైర్మన్‌గా లింబాద్రి(INC) ఎన్నికయ్యారు. 26 వార్డులకు గాను కాంగ్రెస్ కేవలం 6 సీట్లే గెలుచుకుంది. అయితే పలువురు ఇండిపెండెంట్లు, ఒక బీజేపీ సభ్యుడి మద్దతుతో ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది.
News February 16, 2026
ఎమోషన్స్‌ను బయటపెట్టాల్సిందే..

ప్రతిమనిషికీ భావోద్వేగాలు ఉంటాయి. పరిస్థితులను బట్టి అవి బయటకు వస్తాయి. కానీ కొందరు కోపం, భయం, బాధ వస్తే లోలోపలే తొక్కిపెట్టేస్తుంటారు. అవి తలనొప్పి, కడుపు సమస్యలు, గుండెదడ, నిద్రలేమి, అజీర్తి వంటి శారీరక సమస్యల రూపంలో అవి బయటకు వస్తాయంటున్నారు సైకాలజిస్ట్ విశేష్. కాబట్టి ప్రతిఒక్కరూ తమలోని ఎమోషన్స్‌ని సన్నిహితులతో పంచుకోవాలని సూచిస్తున్నారు. కుదరకపోతే సైకాలజిస్ట్ సాయం తీసుకోవాలని చెబుతున్నారు.


