News January 10, 2025

FLASH: కేటీఆర్‌పై కేసు నమోదు

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మరో కేసు నమోదైంది. ఏసీబీ ఆఫీస్ నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారంటూ ఆయనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ-కార్ రేసు వ్యవహారంపై నిన్న ఏసీబీ అధికారులు ఆయనను విచారించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేటీఆర్ బీఆర్ఎస్ ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లారని ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు.

Similar News

News November 14, 2025

దూసుకెళ్తున్న నవీన్ యాదవ్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. ఏడో రౌండ్ ముగిసేసరికి ఆయన 19వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరో మూడు రౌండ్లు కౌంటింగ్ చేయాల్సి ఉంది.

News November 14, 2025

గొర్రె పిల్లల పెరుగుదల వేగంగా ఉండాలంటే..

image

గొర్రె పిల్లల పెరుగుదల వాటి జాతి, లభించే పోషకాహారంపై ఆధారపడి ఉంటుంది. పుట్టిన నెల వయసు నుంచే గొర్రె పిల్లలను కూడా తల్లులతో పాటు మేత కోసం బయటకు తీసుకెళ్తారు. ఆ సమయంలో సంపూర్ణ పోషకాహారం అందక గొర్రె పిల్లల్లో రోజువారీ పెరుగుదల 100 గ్రాములకు మించడం లేదు. అదే గొర్రె పిల్లలకు 150 రోజుల వరకు షెడ్లలో ఉంచి సంపూర్ణ ఆహారం అందిస్తే అవి రోజుకు కనీసం 175 గ్రాముల వరకు పెరుగుతాయని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు.

News November 14, 2025

డబుల్ సెంచరీ దిశగా NDA!

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయం దిశగా NDA దూసుకువెళ్తోంది. ప్రస్తుతం 191 సీట్లలో లీడింగ్‌లో ఉండగా డబుల్ సెంచరీ దిశగా సాగుతోంది. మహాగఠ్‌బంధన్ హాఫ్ సెంచరీ మార్క్ కూడా దాటలేదు. ప్రస్తుతం 48 చోట్ల మాత్రమే లీడింగ్‌లో ఉంది. తేజస్వీ యాదవ్ వంటి కీలక నేతలు కూడా వెనుకబడటం గమనార్హం.