News April 19, 2024
FLASH: చెన్నై ఓటమి.. లక్నో సూపర్ విక్టరీ

CSKతో జరిగిన మ్యాచ్‌లో LSG 8 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. కేఎల్ రాహుల్ 82, డికాక్ 54 రాణించారు. ముస్తాఫిజుర్, పతిరణ చెరో వికెట్ తీశారు. చెన్నై బ్యాటర్లలో జడేజా 57, రహానే 36, అలీ 30, ధోనీ 28 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో కృనాల్ 2, స్టొయినిస్, బిష్ణోయ్, మోసిన్ ఖాన్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.
Similar News
News March 18, 2026
చక్రం తిప్పుతున్న త్రిష?

తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం హీరోయిన్ <<19317674>>త్రిష<<>> చుట్టే తిరుగుతున్నాయి. విజయ్ TVK పార్టీ NDAతో పొత్తు నిర్ణయం ఆమె చేతుల్లోనే ఉందని వార్తలొస్తున్నాయి. ఇటీవల అమిత్ షాతోనూ త్రిష భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్వరలోనే TN రాజకీయాల్లో సంచలనాలు తప్పేలా కనిపించడంలేదు. మరోవైపు AIADMK నేతలూ త్రిషతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. TVK,BJP,AIADMK కలిసి DMKను ఢీ కొట్టనున్నాయా?
News March 18, 2026
కార్డియో VS యోగా VS స్ట్రెంత్ ట్రైనింగ్.. పొట్ట తగ్గడానికి ఏది బెస్ట్?

ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయడంలో కార్డియో టాప్ అయితే, విశ్రాంతి సమయంలోనూ క్యాలరీలు ఖర్చయ్యేలా మెటబాలిజం పెంచడానికి స్ట్రెంత్ ట్రైనింగ్ అవసరం. ఇక యోగా క్యాలరీలు తక్కువగా ఖర్చు చేసినా స్ట్రెస్ హార్మోన్లను తగ్గించి పొట్ట దగ్గర కొవ్వు చేరకుండా చూస్తుంది. వీటన్నింటి కాంబినేషన్ బెస్ట్ రిజల్ట్ ఇస్తుందని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. వీటితో పాటు ప్రొటీన్ ఎక్కువగా ఉండే డైట్ తీసుకోవాలని అంటున్నారు.
News March 18, 2026
ట్రంప్‌ను లేపేస్తానన్నాడు.. అతడినే లేపేశారు!

యుద్ధంలో ఇరాన్ మరో కీలక నేతను కోల్పోయింది. ఆ దేశ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజనీని చంపేశామన్న ఇజ్రాయెల్ <<19410383>>ప్రకటనను <<>>ఇరాన్ తాజాగా ధ్రువీకరించింది. శత్రుదేశం దాడిలో లారిజనీతో పాటు అతడి కొడుకు, సెక్యూరిటీ సిబ్బంది మరణించినట్లు పేర్కొంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి అలీ లారిజనీ US, ఇజ్రాయెల్‌కు వార్నింగ్స్ ఇస్తూ వచ్చారు. ట్రంప్‌ను వదిలేదే లేదని, ఆయనను లేపేస్తామంటూ హెచ్చరించారు. ఇంతలో ఆయనే హతమయ్యారు.


