News May 3, 2024
FLASH: రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు

TG: దేశంలో సంచలనం సృష్టించిన HCU స్టూడెంట్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది. ఇవాళ ఉదయం ఆ కేసును <<13173448>>ముగించినట్లు<<>> పోలీసులు ప్రకటించగా, వర్సిటీలో విద్యార్థులు <<13175252>>ఆందోళనకు<<>> దిగారు. దీంతో కేసును రీఓపెన్ చేయాలని రాష్ట్ర డీజీపీ నిర్ణయించారు. పునర్విచారణకు అనుమతి కోరుతూ పోలీస్ శాఖ రేపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది.
Similar News
News January 31, 2026
APPLY NOW: IAFలో అగ్నివీర్ వాయు పోస్టులు

<
News January 31, 2026
ఉసిరి నూనెతో ఒత్తైన జుట్టు

మన పూర్వీకులు తరతరాలుగా కురుల ఆరోగ్యం కోసం ఉసిరి నూనెను వాడుతున్నారు. ఈ నూనె వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే కురుల పెరుగుదలను వృద్ధి చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీ యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకలు రాలకుండా చూస్తాయి. కురులు తేమగా, మెరిసేలా చేస్తాయి. అలాగే చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే ఉసిరి నూనెలోని యాంటీ మైక్రోబియల్ గుణం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.
News January 31, 2026
పళ్లు పుచ్చిపోయాయా.. కొత్త జెల్ వచ్చేస్తోంది!

పంటి ఎనామిల్ను తిరిగి పెంచే కొత్త ప్రొటీన్ జెల్ను UKలోని నాటింగ్హామ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ జెల్ పంటిపై రాస్తే అది లాలాజలం నుంచి కాల్షియం, ఫాస్ఫేట్లను గ్రహించి దంతాన్ని మళ్లీ సహజంగా మొలిపిస్తుంది. వారంలోనే మార్పు కనిపిస్తుందని బ్రషింగ్, నమలడాన్ని ఇది తట్టుకుంటుందని ప్రయోగాలు నిరూపించాయి. దీని క్లినికల్ ట్రయల్స్ 2026లో ప్రారంభం కానున్నాయి.


