News April 19, 2024

FLASH: తిరుమలలో అగ్ని ప్రమాదం

image

AP: తిరుమలలో అగ్ని ప్రమాదం జరిగింది. పార్వేట మండపం, శ్రీగంధం వనం ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో దట్టంగా పొగ అలుముకుంది. వన్యప్రాణులు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. భారీ ఎండల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Similar News

News February 3, 2026

SIRపై న్యాయపోరాటం కొనసాగుతుంది: మమత

image

SIR పేరుతో బెంగాలీలు, TMC నేతలను EC అధికారులు వేధిస్తున్నారని వెస్ట్ బెంగాల్ CM మమతా బెనర్జీ ఆరోపించారు. ఢిల్లీలో CEC జ్ఞానేష్ కుమార్‌‌‌తో నిన్న భేటీ అయ్యి పలు విషయాలపై చర్చిస్తూ అర్ధాంతరంగా బయటకు వెళ్లారు. ‘ఓటర్లకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా లక్షలాది ఓట్లు తొలగించారు. BJPకి EC IT విభాగంగా తయారైంది. దీనినే ప్రజాస్వామ్యం అంటారా?’ అని సంచలన కామెంట్లు చేశారు. SIRపై న్యాయపోరాటం కొనసాగుతుందని తెలిపారు.

News February 3, 2026

ఇంట్లో దేవతా విగ్రహాలు ఎంత ఎత్తు ఉండాలి?

image

ఆగమ శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఏర్పాటు చేసుకునే దేవతల లోహ విగ్రహాల ఎత్తు బొటనవేలి(5cm) కంటే మించకూడదు. ఇంతకన్నా ఎత్తైన విగ్రహాలను ఉంచితే వాటికి ఆవాహన, విసర్జన వంటి సంక్లిష్ట మంత్రోపచారాలతో పూజలు చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ పూజ నిష్ఫలం అవుతుంది. ఈ సంస్కారాలు ఆచరించడం కష్టం కాబట్టి చిన్న విగ్రహాలే శ్రేయస్కరం. ఇంట్లో ఏ విగ్రహాలు ఏ దిశలో ఉండాలి, ఏ చిత్రపటాలు ఉండకూడదో తెలుసుకునేందుకు క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.

News February 3, 2026

ఈ అలవాట్లు అందానికి శత్రువులు

image

మచ్చలు లేని అందంగా మెరుస్తూ ఉండే చర్మం కావాలని ప్రతి అమ్మాయీ కోరుకుంటుంది. అయితే దీనికోసం కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం, పాల ఉత్పత్తులు మితంగా తీసుకోవాలి. చక్కెర, జంక్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. ఎవరో చెప్పారని చర్మంపై ప్రయోగాలు చెయ్యకూడదు. కంటినిండా నిద్ర చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. పడుకొనే ముందు మేకప్ తొలగించాలి. నీరు ఎక్కువగా తాగాలి.