News October 31, 2025
FLASH.. FLASH.. హనుమకొండ: పెళ్లి వాహనానికి యాక్సిడెంట్.. ముగ్గురు మృతి

హనుమకొండ(D)భీమదేవరపల్లి(M) ముల్కనూర్ PS పరిధి గోపాలపురం దగ్గర ఈరోజు తెల్లవారుజామున 2.20 గంటలకు యాక్సిడెంట్ జరిగింది. మహబూబాబాద్(D) కురవి(M) సైదాపురం గ్రామానికి చెందిన 21మంది నల్లపూసల తంతు ముగించుకుని పెళ్లి వాహనం (బొలేరో)లో సిద్దిపేట నుంచి తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో గోపాలపురం దగ్గర వెనుక నుంచి లారీ ఢీకొట్టింది.ముగ్గురు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. వారిని వరంగల్ MGMకు అంబులెన్స్‌లో తరలించారు.
Similar News
News October 31, 2025
ఓపెన్ స్కూల్ 10TH, ఇంటర్ ఫలితాలు విడుదల.. ములుగు జిల్లా టాప్!

ఈ ఏడాది SEPTలో నిర్వహించిన ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను రాష్ట్ర ఓపెన్ స్కూల్ డైరెక్టర్ విడుదల చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ములుగు జిల్లా అత్యధిక ఉత్తీర్ణత సాధించింది. 10THలో 87.50%, ఇంటర్‌లో 70.08% ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచింది. హనుమకొండలో టెన్త్ 77.14%, వరంగల్‌లో 31.18%, మహబూబాబాద్‌లో 78.95% సాధించారు. రీవెరిఫికేషన్‌కు NOV 4 నుంచి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
News October 31, 2025
ప్రకాశం జిల్లాలో నేడు పాఠశాలలు పునః ప్రారంభం

తుఫాన్ ప్రభావం తగ్గడంతో నేటి నుంచి యధావిధిగా పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. వరుసగా 4 రోజులు తుఫాను సెలవుల అనంతరం నేడు బడిగంట మోగనుంది. ఈ దశలో విద్యార్థుల భద్రతకోసం ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని DEO కిరణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల పరిసరాల్లో చెట్ల కొమ్మలు, కరెంట్ వైర్లు, తడిసిన గోడలు వంటి అంశాలను పరిశీలించి విద్యార్థుల పట్ల జాగ్రత్త వహించాలని ఆయన కోరారు.
News October 31, 2025
ఐపీవోకు Groww

స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ‘గ్రో’ మాతృసంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ NOV 4-7 మధ్య పబ్లిక్ ఇష్యూకు రానుంది. షేర్ల ధరలను రూ.95-100గా నిర్ణయించింది. ఫ్రెష్ ఇష్యూ కింద రూ.1,060Cr విలువైన షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ కింద 55.72 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, వాటాదార్లు విక్రయించనున్నారు. దీంతో రూ.6,632Cr సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. తద్వారా సంస్థ విలువ రూ.61,700Crకు చేరొచ్చని అంచనా.


