News June 4, 2024
FLASH.. FLASH: కొడాలి నాని ఘోర ఓటమి

గుడివాడలో టీడీపీ జెండా ఎగిరింది. అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియర్ నేత కొడాలి నాని ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసిన వెనిగండ్ల రాము 51 వేల ఓట్ల మెజారిటీతో జయకేతనం ఎగరేశారు.
Similar News
News December 26, 2025
డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి: కిషన్ రెడ్డి

TG: డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. పదేళ్లలో 2 ప్రభుత్వాలు కలిసి రూ.10 లక్షల కోట్లు అప్పు చేశాయని ఆదిలాబాద్‌లో జరిగిన సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆరోపించారు. దోచుకున్న ఆస్తులు కాపాడుకోవడానికి KCR కుటుంబం రోడ్డెక్కిందన్నారు. రేవంత్ పాలనలో రాష్ట్రం మరింత ఆగమైందని విమర్శించారు.
News December 26, 2025
అసలైన పట్టును ఇలా గుర్తించండి

మార్కెట్లో పట్టు చీరలంటూ అనేక రకాల డూప్లికేట్లు అందుబాటులో ఉన్నాయి. అసలైన పట్టును ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పట్టు పోగుని వెలిగించినప్పుడు కాలకుండా ఆరిపోతుంది. అలాగే వెంట్రుకలు, ఈకలు కాలిన వాసన వస్తుంది. పట్టుకొనేముందు సిల్క్‌మార్క్ లేబుల్ ఉందో లేదో చూసుకోవాలి. స్వచ్ఛమైన పట్టు వస్త్రాలకు క్యూఆర్ బార్‌కోడ్‌తో కూడిన సిల్క్ మార్క్, మగ్గంపై నేసిన పట్టుకు హ్యాండ్లూమ్ మార్క్ ఉంటుంది.
News December 26, 2025
TGలో సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచంటే?

APలో స్కూళ్లకు JAN 10-18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో TGలో హాలిడేస్ ఎప్పటి నుంచనే చర్చ మొదలైంది. అయితే AP మాదిరిగానే TGలో కూడా జనవరి 10(రెండో శనివారం) నుంచే సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇవి 18వ తేదీ వరకు(9రోజులు) కొనసాగనున్నాయి. 19న(సోమవారం) తిరిగి స్కూల్స్ పున:ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. దీనిపై 2,3 రోజుల్లో విద్యాశాఖ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.


