News September 9, 2024

ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

image

ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్ ఉందని అధికారులు వెల్లడించారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలను అలర్ట్ చేశారు. రేపు ఉదయం 11.30 గంటల వరకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఇచ్చారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Similar News

News November 25, 2025

టెన్త్ పరీక్ష ఫీజు గడువు నవంబర్ 30: డీఈవో

image

పదో తరగతి విద్యార్థులు నవంబర్ 30వ తేదీలోగా పరీక్ష రుసుం తప్పనిసరిగా చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేశ్ తెలిపారు. విద్యార్థుల నామినల్ రోల్స్‌ను పాఠశాల యూడైస్ వివరాలతో ధ్రువీకరించుకోవాలని ప్రధానోపాధ్యాయులకు ఆయన సూచించారు. యూడైస్, ఫీజులు, ఇతర సమస్యల పరిష్కారం కోసం 9959567275, 9490178184, 9951558185 నంబర్లను సంప్రదించాలని డీఈవో పేర్కొన్నారు.

News November 25, 2025

గ్యాస్ లీకైనపుడు ఏం చేయాలంటే?

image

ఇంట్లో గ్యాస్‌ సిలిండర్, స్టవ్‌ లీకేజీ, నిర్వహణ లోపాలతో ప్రమాదాలు జరిగి తీవ్ర విషాదాలను మిగులుస్తున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే.. గ్యాస్‌ లీకై దాన్ని అదుపు చేయలేకపోతే కిటికీలు, తలుపులు తెరవాలి. మంటలు చెలరేగితే మందపాటి దుప్పటి కప్పి ఆర్పేయాలి. రెగ్యులేటర్‌ను ఆపేయాలి. సిలిండర్‌ దగ్గర మంటలు చెలరేగితే తడిగా ఉండే గోనెసంచి/ వస్త్రాన్ని వేయాలి. అగ్నిమాపక శాఖ టోల్‌ఫ్రీ నంబరు 101కు సమాచారం ఇవ్వాలి.

News November 25, 2025

అంత్యక్రియల తర్వాత స్నానం ఎందుకు చేస్తారు?

image

అంత్యక్రియలు పూర్తయ్యాక అక్కడికి వెళ్లిన వాళ్లందరూ స్నానం చేస్తారు. లేకపోతే ఆత్మలు దేహంలోకి ప్రవేశిస్తాయని నమ్ముతుంటారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. దహన సంస్కారాల సమయంలో ఆ దేహం నుంచి వచ్చే బ్యాక్టీరియా, అంటువ్యాధులు మనక్కూడా సోకే ప్రమాదం ఉంది. ఈ అంటురోగాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి, కచ్చితంగా స్నానం చేయాలి. అప్పట్లో నదులే స్నానానికి ప్రధాన వనరులు కాబట్టి అక్కడే స్నానమాచరించేవారు.