News October 22, 2025
ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు ప్రజలెవరూ బయటికి రావొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
Similar News
News October 22, 2025
AP న్యూస్ రౌండప్

*పాయకరావుపేట నియోజకవర్గంలోనే లక్ష ఉద్యోగాలిస్తాం: హోంమంత్రి అనిత
*కూలిన విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశం
*కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉగ్రవాది అబూబకర్ సిద్ధికి భార్య సైరాబానును కస్టడీకి తీసుకుని VJA తరలించిన NIA అధికారులు
*గుంటూరు(D) ఇటికంపాడు రోడ్డు శివారులో పిడుగుపాటుకు మరియమ్మ(45), షేక్ ముజాహిద(45) అక్కడికక్కడే మృతి
News October 22, 2025
NMLలో 21 పోస్టులు

NTPC మైనింగ్ లిమిటెడ్(NML) 21పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మైన్ సర్వేయర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి CA/CMA, ఇంజినీరింగ్ డిగ్రీ( ఎన్విరాన్‌మెంట్), పీజీ డిప్లొమా, MSc, ఎంటెక్, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 27 నుంచి NOV 15వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nml.co.in
News October 22, 2025
హీరో నారా రోహిత్ పెళ్లి తేదీ ఫిక్స్.. నాలుగు రోజులు వేడుకలు!

టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. నటి, ప్రియురాలైన శిరీషను ఈనెల 30న రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈనెల 25న హల్దీ వేడుకతో పెళ్లి వేడుకలు మొదలు కానున్నాయి. 26న పెళ్లి కొడుకు వేడుక, 28న మెహందీ, 30న రాత్రి 10.35 గంటలకు హైదరాబాద్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం జరగనుంది.