News September 8, 2024

ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు.. ఘాట్ రోడ్లపై రాకపోకలు నిషేధం

image

AP: అల్లూరి జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయన్న హెచ్చరికలతో కలెక్టర్ దినేశ్ కుమార్ ప్రజలను అప్రమత్తం చేశారు. వాగులు, గెడ్డలు దాటేందుకు ప్రయత్నించవద్దని స్పష్టం చేశారు. వాహనదారులు ఘాట్ రోడ్లలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో నర్సీపట్నం-సీలేరు, వడ్డాది-పాడేరు, అరకు-అనంతగిరి, రంపచోడవరం-మారేడుమిల్లి, చింతూరు ఘాట్ రోడ్లపై వాహనాల రాకపోకలను నిషేధించారు.

Similar News

News December 6, 2025

APPLY NOW: ECHSలో ఉద్యోగాలు

image

విశాఖపట్నంలోని <>ECHS<<>>లో 14పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, బీఫార్మసీ, డిప్లొమా, ఎనిమిదో తరగతి చదివిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టుకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. వెబ్‌సైట్:https://www.echs.gov.in

News December 6, 2025

పాక్, అఫ్గాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు

image

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దుల్లో నిన్న రాత్రి పెద్ద ఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. స్పిన్ బోల్డక్‌ జిల్లాలో పాక్ దళాలు దాడులు ప్రారంభించాయని అఫ్గాన్ చెప్పింది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకున్నా చమన్ సరిహద్దులో అఫ్గాన్ కాల్పులు జరిపిందని పాక్ ఆరోపించింది. 2 దేశాల మధ్య శాంతి చర్చలు పురోగతి లేకుండా ముగిసిన నేపథ్యంలో ఈ ఘటనలు జరగడం గమనార్హం.

News December 6, 2025

కెప్టెన్సీకి నేను సిద్ధం: రియాన్ పరాగ్

image

IPL-2026లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని పరాగ్ తెలిపారు. ‘గత సీజన్‌లో 7-8 మ్యాచులకు కెప్టెన్సీ చేశా. 80-85% సరైన నిర్ణయాలే తీసుకున్నా. మినీ ఆక్షన్ తర్వాత కెప్టెన్ ఎవరనేది డిసైడవుతుంది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ CSKకి ట్రేడ్ అవడంతో తర్వాతి కెప్టెన్ ఎవరనే చర్చ జరుగుతోంది. జైస్వాల్, జురెల్, పరాగ్ ఈ రేసులో ఉన్నారు.