News November 29, 2024
FLASH: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.700 పెరిగి రూ.71,600కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.760 పెరగడంతో రూ.78,110 పలుకుతోంది. కేజీ సిల్వర్ రేట్ రూ.2,000 పెరిగి రూ.లక్షకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
Similar News
News October 18, 2025
నేడు ఉద్యోగ సంఘాలతో చర్చలు

AP: నేడు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో కీలక చర్చలు జరగనున్నాయి. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో మంత్రుల బృందం వారితో సమావేశంకానుంది. పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు, జీపీఎఫ్, పీఎఫ్ సమస్యలు, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధిత సమస్యలపై చర్చించనున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సీఎస్ విజయానంద్ ఈ భేటీలో పాల్గొంటారు.
News October 18, 2025
భారత్కు ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీ!

ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీని భారత్కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ అభ్యర్థన మేరకు అతడిని అరెస్టు చేయడం సరైందేనని అట్వర్ప్లోని న్యాయస్థానం పేర్కొంది. అయితే అతడికి హైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నా అతడిని ఇండియాకి తీసుకురావడంలో ఇది కీలక అడుగుగా చెప్పొచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13 వేల కోట్లు ఎగవేసి ఛోక్సీ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.
News October 18, 2025
వేదాల ప్రధాన లక్ష్యం ఇదే..

మానవాళిని 3 రకాల కష్టాల నుంచి విముక్తి కలిగించడమే వేదాల ప్రధాన లక్ష్యం. ఈ కష్టాలనే త్రిబాధలని అంటారు. అందులో మొదటిది మన శరీరానికీ, మనసుకీ వచ్చే సమస్యలు. రెండోది ఇతరులు, జంతువుల వల్ల కలిగే బాధలు. చివరిది ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే కష్టాలు. ఈ మూడు బాధలు తొలగి, ప్రతి ఒక్కరూ జీవితంలో నిజమైన శాంతిని, సుఖాన్ని పొందాలని వేదం కోరుకుంటుంది. ఇందుకోసం భగవంతుడిని ప్రార్థించమని ఉద్బోధిస్తుంది. <<-se>>#VedikiVibes<<>>