News August 16, 2025
FLASH: క్రమంగా తగ్గుతున్న బంగారం ధరలు

బంగారం దిగుమతులపై ఎలాంటి టారిఫ్‌లు విధించమని ట్రంప్ ప్రకటించడంతో గత వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.60 తగ్గి రూ.1,01,180కు చేరింది. 8 రోజుల్లో మొత్తం ₹2,130 తగ్గింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.50 పతనమై రూ.92,750 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,26,200గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News August 16, 2025
పిల్లల్ని కనే రోబో.. 9 నెలల్లో డెలివరీ!

కృత్రిమ గర్భంతో పిల్లల్ని కనే రోబోను చైనా అభివృద్ధి చేస్తోంది. సింగపూర్ నాన్యాంగ్ వర్సిటీ సైంటిస్ట్ డా.జాంగ్ కిఫెంగ్ నేతృత్వంలో ‘ప్రెగ్నెన్సీ రోబో’ను పరిశోధకులు డెవలప్ చేస్తున్నారు. ఇందులో ఆర్టిఫీషియల్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్‌ను ప్రవేశపెట్టి, ట్యూబ్ ద్వారా న్యూట్రియెంట్స్ అందిస్తారు. 9 నెలల్లో శిశువు తయారవుతుంది. 2026 నాటికి రోబో నమూనా తయారవుతుందని, ఇందుకోసం ₹12.96L ఖర్చవుతుందని చెబుతున్నారు.
News August 16, 2025
సుంకాలపై మారిన ట్రంప్ వైఖరి!

పుతిన్‌తో భేటీ ముగిశాక ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలపై ప్రస్తుతం సెకండరీ టారిఫ్స్ విధించే అవసరం లేదు. 2-3 వారాల్లో దీనిపై మరోసారి ఆలోచిస్తా’ అని చెప్పారు. కాగా ప్రస్తుతం ఇండియా దిగుమతులపై 25% టారిఫ్ అమలవుతోంది. అదనంగా మరో 25% సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలు కానున్నాయి. ట్రంప్ ప్రకటనతో ఈ టారిఫ్స్ నిలిచిపోయే అవకాశం ఉంది.
News August 16, 2025
ఆసియా కప్: ఫిట్‌గా సూర్యకుమార్ యాదవ్!

టీమ్ఇండియా టీ20I కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. గాయం నుంచి కోలుకున్న ఆయన ఆసియా కప్‌కు ముందు నిర్వహించిన టెస్టుల్లో పాస్ అయ్యారని వెల్లడించాయి. జట్టు ఎంపికకు ముందు ఈ వార్త సెలక్టర్లకు మరింత రిలీఫ్ ఇవ్వనుంది. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత సూర్య సారథ్యంలో జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోన్న సంగతి తెలిసిందే.