News December 2, 2024
FLASH: మళ్లీ తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.600 తగ్గి రూ.70,900కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.650 తగ్గడంతో రూ.77,350 పలుకుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.500 తగ్గి రూ.99,500కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News January 7, 2026
₹5800 CRతో మూసీ పునరుజ్జీవనానికి ముహూర్తం ఫిక్స్

TG: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రూ.5800 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకు ఉగాది నాడు CM రేవంత్ శంకుస్థాపన చేస్తారు. గండిపేట నుంచి బాపుఘాట్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 21 KM మేర నదిని సుందరీకరణ చేస్తారు. ముందుగా నదిలో పూడిక తీసి తీరప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. ఆపై గోదావరి నీరు ప్రవహించేలా ప్రణాళికను రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
News January 7, 2026
పసుపు పంట కోతకు వచ్చినట్లు ఎలా గుర్తించాలి?

పసుపు రకాన్ని బట్టి పంట కాలం 7 నుంచి 9 నెలలుగా ఉంటుంది. పసుపు పంట పక్వానికి వచ్చిన తర్వాతే కోత కోయడం ప్రారంభించాలి. పక్వానికి రాకముందే పంట కోత చేపడితే దిగుబడి తగ్గడంతో పాటు, కుర్కుమిన్ శాతం కూడా తక్కువగా ఉంటుంది. దీని వల్ల దిగుబడిలో నాణ్యత లోపిస్తుంది. మొక్కల ఆకులు పాలిపోయి, తర్వాత ఎండిపోయి నేలపై పడిపోతే పంట కాలం పూర్తి అయ్యిందని గుర్తించవచ్చు. ఈ దశలో దుంపలను, కొమ్ములను తవ్వి తీయాలి.
News January 7, 2026
తూర్పు గోదావరి జిల్లాలో 60 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

AP: రాజమహేంద్రవరంలోని GMC, GGHలో 60పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా( అనస్థీషియా టెక్నీషియన్, కార్డియాలజీ, మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్& ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ECG), బీఎస్సీ, DMLT, BSc(MLT), ఇంటర్(ఒకేషనల్), CLISc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. వెబ్సైట్: https://eastgodavari.ap.gov.in


