News November 12, 2024

FLASH: హాల్‌టికెట్లు విడుదల

image

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్(CHSL) టైర్-2 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను SSC విడుదల చేసింది. అభ్యర్థులు <>https://ssc.gov.in/<<>> వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 3,712 గ్రూప్-C ఉద్యోగాల(లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్)కు ఈ నెల 18న రెండు సెషన్లలో ఆన్‌లైన్ పరీక్ష జరగనుంది.

Similar News

News January 20, 2026

షుగర్ పేషంట్లకు ‘తీపి’ వార్త!

image

తీపి అంటే ఇష్టం ఉన్నా ఆరోగ్య సమస్యల వల్ల దూరంగా ఉండేవారికి శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. సూక్రోస్‌లోని 92% తియ్యదనం, అందులో 1/3 వంతే క్యాలరీలు ఉన్న ‘తగటోస్’(Tagatose) అనే కొత్త రకం షుగర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయులను పెంచదు. దీనివల్ల బరువు పెరుగుతామన్న భయం లేకుండా డయాబెటిస్ ఉన్నవారూ మధుర రుచిని ఆస్వాదించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

News January 20, 2026

NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>NIT <<>>వరంగల్ 39 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ/బీటెక్, డిప్లొమా, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఇంటర్, టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, ST, PwBDలకు రూ.1000. స్క్రీనింగ్/స్కిల్/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitw.ac.in/

News January 20, 2026

పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దు: హైకోర్టు

image

TG: చలాన్ల వసూలుపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దని, బైక్ కీస్ లాక్కోవడం, బండిని సీజ్ చేయడం లాంటివి చేయొద్దని పోలీసులను ఆదేశించింది. వాహనదారుడు స్వచ్ఛందంగా చెల్లిస్తేనే వసూలు చేయాలని సూచించింది. లేకుంటే నోటీసులు ఇవ్వాలని తెలిపింది. న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.