News January 9, 2026
FLASH: HYDలో బస్సు బోల్తా

సినిమా షూటింగ్‌కు వెళ్తున్న బస్సు పెద్దఅంబర్‌పేట్‌లో బోల్తా కొట్టింది. హయత్‌నగర్ సీఐ నాగరాజు గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి మణికొండకు వస్తున్న బస్సు పెద్ద అంబర్‌పేట్ ఫ్లైఓవర్ స్టార్టింగ్‌లో డివైడర్‌ని ఢీకొట్టి బోల్తా కొట్టింది. డ్రైవర్ విజయ భాస్కర్ రెడ్డి, నర్సిరెడ్డి, ఎలక్ట్రిషన్, డ్రైవర్ విజయ్‌లకు గాయాలయ్యాని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 20, 2026
HYD: ట్రాఫిక్ పోలీసుల సేఫ్టీ.. స్టైలిష్ లుక్!

రోడ్లపై నిలబడి ఎండ, ధూళితో కుస్తీ పట్టే మన ట్రాఫిక్ అన్నలకు ఇప్పుడు అదిరిపోయే రక్షణ దొరికింది. సైబరాబాద్ జాయింట్ CP గజరావు భూపాల్ చేతుల మీదుగా సిబ్బందికి స్పెషల్ గాగుల్స్ పంపిణీ చేశారు. ఎండ వేడిమి, కాలుష్యం నుంచి కళ్లను కాపాడుకుంటేనే, పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఇప్పుడు మన ట్రాఫిక్ పోలీసులు హెల్తీగా, స్టైలిష్‌గా డ్యూటీ చేయబోతున్నారు.
News January 20, 2026
జగిత్యాల: వృద్ధుల వసతి భవన్, డే కేర్ సెంటర్ ప్రారంభం

జగిత్యాల జిల్లా కేంద్రంలోని తారకరామ నగర్‌లో రూ.1.50 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ వృద్ధుల వసతి భవన్, అలాగే పట్టణ బైపాస్ రోడ్డులో డే కేర్ సెంటర్‌ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ భవనానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు.
News January 20, 2026
NGKL: జిల్లాలో 1,659 టన్నుల యూరియా నిల్వలు

నాగర్ కర్నూల్ జిల్లాలో 1,659 టన్నుల యూరియా నిలువలు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెలలో మరో 3,369 టన్నుల యూరియా జిల్లాకు కేటాయించబడిందన్నారు. ఇంకా 20, వేల టన్నుల యూరియా అవసరముందని తెలిపారు. మొక్కజొన్న సాగు ఆరు రేట్లు పెరిగినందున యూరియా డిమాండ్ పెరిగినట్లు చెప్పారు. మొక్కజొన్న పంట సాగుచేసిన రైతులందరికీ దాదాపుగా యూరియా పంపిణీ చేశామన్నారు.


