News March 24, 2024

FLASH: HYD: డీజిల్ తరలిస్తున్న ముఠా గుట్టురట్టు

image

కర్ణాటక నుంచి HYDకు డీజిల్‌ను తరలిస్తున్న ముఠాను కోకాపేటలో శంషాబాద్ SOT పోలీసులు అరెస్టు చేశారు. ట్యాంకర్లలో డీజీల్‌ను తెచ్చి HYD శివారు ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. రూ.15 లక్షల విలువ చేసే 15 వేల లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేయగా.. నలుగురు పరారీలో ఉన్నారు. 4 డీజిల్ ట్యాంకర్లు సీజ్ చేసి సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు కేసు నమోదు చేశారు.

Similar News

News April 4, 2026

రాజేంద్రనగర్‌లో హైకోర్టు భవనానికి శంకుస్థాపన

image

రాజేంద్రనగర్‌లో తెలంగాణ హైకోర్టు జోన్-II భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ పాల్గొన్నారు. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఆయనకి గణస్వాగతం పలికారు. CS కె.రామకృష్ణారావు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ తదితరులు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చారు.

News April 4, 2026

సరూర్‌నగర్: 7న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

image

రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7న జిల్లా స్థాయి ఫెడరేషన్ కప్ పోటీలు నిర్వహించనున్నారు. స్థానిక సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ పోటీల వివరాలను సంఘం కార్యదర్శి గోపి వెల్లడించారు. 16 ఏళ్లు పైబడిన వారు, అలాగే అండర్-20 పురుషులు, మహిళా విభాగాల్లో ఈ క్రీడలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News April 2, 2026

RR: గ్రామసభలు ప్రజా సమస్యల కోసమా? ప్రచారం కోసమా?

image

గ్రామ సమస్యలు, అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం జరగాల్సిన గ్రామసభలు పక్కదారి పడుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయి సమస్యలను చర్చించాల్సింది పోయి, అధికారులు కేవలం ప్రభుత్వ పథకాలకు ‘డప్పు’ కొట్టడానికే పరిమితమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేదలకు అందాల్సిన పథకాలు పైరవీకారుల పాలవుతున్నాయని, అధికారులు అధికార పక్షానికి వత్తాసు పలుకుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.