News August 6, 2024

FLASH: HYD: రోడ్డు ప్రమాదం.. తెగిపోయిన తల

image

శంషాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ అతివేగంతో వెళ్తూ వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి తల కారు అద్దంలో ఇరుక్కుపోయింది. ఈడ్చుకొని వెళ్లడంతో తల తెగి కారు వెనక సీటులో పడిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 6, 2026

HYD: మీ గుడి నుంచి పూజలు.. రూ.50 వేల ఆదాయం

image

ప్రముఖ ఆధ్యాత్మిక ప్లాట్‌ఫాం వేదమందిర్‌కు సేవలందించేందుకు పురోహితులు కావలెను. మీ ప్రాంతంలోనే ఉండి, మీ దైనందిన కార్యక్రమాలు చూసుకుంటూనే మా కస్టమర్లకు సేవలు అందించవచ్చు. దీంతో మీరు నెలకు రూ.40వేల నుంచి రూ.50 వేల వరకు పొందుతారు. ఆసక్తి గల పురోహితులు <>ఇక్కడ క్లిక్ <<>>చేసి మీ వివరాలు నమోదు చేయండి. మా ప్రతినిధులే మిమ్మల్ని సంప్రదిస్తారు.

News March 6, 2026

HYDలో ఆకాశమే హద్దుగా హోర్డింగ్‌లు!

image

అడ్వర్టైజ్‌మెంట్ పాలసీలో మార్పులతో ​సిటీలో యాడ్ బోర్డుల గోల మొదలైంది. 6ఏళ్లుగా 15 ఫీట్ లిమిట్‌ను సర్కార్ సైలెంట్‌గా ఎత్తేసింది. GHMC, CMC, MMCల్లో ఇక ఆకాశమే హద్దుగా హోర్డింగ్‌లు వెలవనున్నాయి. పెద్ద కంపెనీలకు మేలు చేసేలా టెండర్ కండీషన్లు మార్చారని, చిన్న అడ్వర్టైజర్లు నష్టపోతారనే అరోపణలు ఉన్నాయి. 5ఏళ్ల కాంట్రాక్టుల పేరుతో రూ.కోట్లు ఆదాయానికి గండి కొట్టేలా తెర వెనుక పెద్ద స్కెచ్ నడిచిందని టాక్.

News March 6, 2026

HYD: ఇంజినీరింగ్ కాలేజీలో కొత్త ఫీజులు ఖరారు

image

నగరంలోని పలు ఇంజినీరింగ్ కళాశాలలకు ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఈ ఫీజులు అమలుచేయనున్నారు. 3 సంవత్సరాలపాటు (2027- 28వరకు) ఈ నిబంధనలు అమలవుతాయి. ఇదిలా ఉండగా CBITకి అత్యధిక ఫీజు రూ.1.83 లక్షలు, ఆ తర్వాత వాసవికి రూ.1.75 లక్షలు, MGITకి రూ.1.67 లక్షలు, CVRకు రూ.1.63 లక్షలు, నారాయణమ్మకు రూ.1.62 లక్షలుగా నిర్ధారించారు.