News September 21, 2025
FLASH: HYD కమిషనరేట్‌లో భారీగా పోలీసుల బదిలీలు

HYD పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా పోలీసుల బదిలీలు, పోస్టింగ్స్ జరిగాయి. ఉమెన్ ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్‌కు సైతం సీపీ సీవీ ఆనంద్ పోస్టింగ్స్ ఇచ్చారు. 38 మంది ఎస్ఐలు, పీఎస్ఐల సాధారణ బదిలీలు, పోస్టింగ్స్ ఇచ్చారు. 47 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 78 మంది కానిస్టేబుల్స్ బదిలీలు జరిగాయి.
Similar News
News September 21, 2025
HYD: ORR నుంచి 55 కిలోమీటర్ల రేడియల్ రోడ్డు

HYD ఔటర్ రింగ్ రోడ్డు నుంచి పలు ప్రాంతాలకు రీజినల్ రింగ్ రోడ్డు పనులు సర్కారు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ORR ఎగ్జిట్ నంబర్ 17 నుంచి దాదాపు 55 కిలోమీటర్లు పరిగి ORR వరకు ఈ రోడ్డు నిర్మించనుంది. ఇందుకు సంబంధించి మార్కింగ్ పనులను కూడా అధికారులు ప్రారంభించారు. దాదాపు 24 గ్రామాలను ఈ రహదారి కలుపుతుంది. రేడియల్ పనులు మొత్తం హెచ్ఎండీఏ పర్యవేక్షిస్తుంది.
News September 21, 2025
HYD: హత్య కేసు ఛేదన.. క్యాబ్ డ్రైవర్‌కు సత్కారం

HYD కూకట్‌పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో కీలక సమాచారం అందించిన క్యాబ్ డ్రైవర్ శ్రీకాంత్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఈరోజు అభినందించారు. కేసు దర్యాప్తులో ధైర్యం చూపించినందుకు ఆయనకు క్యాష్ రివార్డ్ అందజేశారు. బాలానగర్ DCP సురేశ్‌కుమార్‌తోపాటు కూకట్‌పల్లి పోలీస్ సిబ్బందిని కూడా కమిషనర్ ప్రశంసించి నగదు బహుమతి ఇచ్చారు. ప్రజల సహకారంతోనే నేరాలను తగ్గించవచ్చన్నారు.
News September 21, 2025
HYD: సైబరాబాద్‌లో భారీగా డ్రగ్స్ ధ్వంసం

మాదకద్రవ్యాల మాఫియాకు సైబరాబాద్ పోలీసులు గట్టి హెచ్చరికలు ఇచ్చారు. రూ.25.30 కోట్ల విలువైన 1,858 కిలోల మాదకద్రవ్యాలను ఈరోజు ధ్వంసం చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కమిషనరేట్ చేపట్టిన 7వ దశ చర్య ఇది అని పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి పర్యవేక్షణలో డీసీపీ ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో 316 కేసులకు సంబంధించిన ఈ డ్రగ్స్‌ను పర్యావరణ నిబంధనల ప్రకారం దహనం చేశారు.