News September 21, 2025
FLASH: HYD కమిషనరేట్‌లో భారీగా పోలీసుల బదిలీలు

HYD పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా పోలీసుల బదిలీలు, పోస్టింగ్స్ జరిగాయి. ఉమెన్ ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్‌కు సైతం సీపీ సీవీ ఆనంద్ పోస్టింగ్స్ ఇచ్చారు. 38 మంది ఎస్ఐలు, పీఎస్ఐల సాధారణ బదిలీలు, పోస్టింగ్స్ ఇచ్చారు. 47 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 78 మంది కానిస్టేబుల్స్ బదిలీలు జరిగాయి.
Similar News
News September 21, 2025
ఈ గౌరవం నా ఒక్కడిదే కాదు: మోహన్ లాల్

దాదాసాహెబ్ ఫాల్కే <<17774717>>అవార్డుకు<<>> ఎంపికవ్వడం నిజంగా గర్వకారణమని నటుడు మోహన్ లాల్ ట్వీట్ చేశారు. ఈ గౌరవం తన ఒక్కడిదే కాదని, తన ప్రయాణంలో పక్కనే ఉండి నడిచినవారిదని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, ప్రేక్షకులు, సహచరులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల ప్రేమ, నమ్మకం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. డైరెక్టర్ అదూర్ గోపాలకృష్ణన్(2004) తర్వాత మలయాళం నుంచి ఈ అవార్డు అందుకోనున్న రెండో వ్యక్తి మోహన్ లాల్.
News September 21, 2025
వరంగల్: ప్రకృతి పండుగకు పువ్వులు కరవు..!

వరంగల్ జిల్లాలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే మహిళల్లో ఎనలేని ఆనందం నెలకొంటుంది. అలాంటి ప్రకృతి పండుగకు పూలే కరవయ్యాయి. నగరాలకు పూల కొరత ఉన్నప్పటికీ కాస్త గ్రామీణ ప్రాంతాల్లో మెరుగ్గానే పూలు దొరికేవి. కానీ, ప్రతి సెంటు భూమి కూడా సాగులోకి రావడంతో తంగేడు, గునుగు కనిపించట్లేదు. బతుకమ్మ పేర్చాలంటే ఈ రెండు రకాల పూలు లేకపోతే మహిళలకు తీసికట్టుగా ఉంటుంది. దీంతో గ్రామాల నుంచి నగరాలకు పూలు తరలి వెళ్తున్నాయి.
News September 21, 2025
KMR: రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు 9 నమూనాల ఎంపిక

కామారెడ్డి జిల్లా నుంచి 9 ప్రదర్శనలు రాష్ట్ర స్థాయి ఎఫ్‌ఎల్‌ఎన్ బోధనాభ్యాసన సామగ్రి మేళాకు ఎంపికైనట్లు DEO రాజు తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఈవీఎస్‌ల నుంచి రెండేసి, ఉర్దూ నుంచి ఒక ప్రదర్శన ఎంపికయ్యాయన్నారు. జిల్లాకు ఈ ఘనత సాధించిపెట్టిన ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ఈ ప్రదర్శనలు జిల్లా విద్యా ప్రమాణాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.