News March 24, 2024

FLASH: HYD: డీజీల్ తరలిస్తున్న ముఠా గుట్టురట్టు

image

కోకాపేటలో కర్ణాటక నుంచి HYDకు డీజిల్‌ను తరలిస్తున్న ముఠాను శంషాబాద్ SOT పోలీసులు గుట్టురట్టు చేశారు. ట్యాంకర్లలో డీజీల్‌ను తెచ్చి HYD శివారు ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. రూ.15 లక్షల విలువ చేసే 15 వేల లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేయగా.. నలుగురు పరారీలో ఉన్నారు. 4 డీజిల్ ట్యాంకర్లు సీజ్ చేసి సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు కేసు నమోదు చేశారు.

Similar News

News March 10, 2026

HYD: అర్ధరాత్రి సందడే.. సందడి!

image

రంజాన్ పండుగ సమీపిస్తున్న తరుణంలో HYDలో పది రోజుల పాటు సందడి నెలకొననుంది. చార్మినార్, టోలిచౌకి, పాతబస్తీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నైట్ బజార్లకు నగర నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివస్తుండటంతో అర్ధరాత్రి వేళ కూడా ఆ వీధులన్నీ షాపింగ్ ప్రియులతో కళకళలాడుతున్నాయి. పాతబస్తీలో వ్యాపారాలు జోరందుకోగా, పెరిగిన వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు.

News March 9, 2026

HYD స్టేడియాలకు మహర్దశ.. లిస్టులో ఇవే!

image

నగరంలోని వివిధ ప్రాంతాల స్టేడియాలకు మహర్దశ పట్టనుంది. సరూర్‌నగర్ స్టేడియం, ఎల్బీ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, లాల్ బహుదూర్ శాస్త్రి స్టేడియాలను ఆధునికరించాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆయా సంబంధిత శాఖకు నేడు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రణాళికలు రచించి వేసవిలో పనులు ప్రారంభించి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News March 9, 2026

హైదరాబాద్ స్ట్రీట్స్ ఇప్పుడు ఫ్యాషన్ అడ్డా!

image

HYD యువత ఇప్పుడు ఇంటర్నేషనల్ వైబ్స్‌ను మన లోకల్ స్టైల్‌తో కలిపేస్తోంది. జూబ్లీహిల్స్ నుంచి పాతబస్తీ వరకు గ్లామర్, క్లీన్-గర్ల్ మినిమలిజం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్. ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్, కార్గోలతో హుషారుగా కనిపిస్తూనే మన దేశీ జ్యువెలరీతో ‘ఫ్యూజన్’ క్రేజ్ పుట్టిస్తున్నారు. చిన్న ఆన్‌లైన్ లేబుల్స్, స్నీకర్ల స్టైలింగ్‌తో మన HYD Gen-Z అదరగొట్టేస్తున్నారు. మరి మీ స్టైల్ ఏంటో చెప్పండి?