News January 18, 2026

FLASH.. HYD: భార్యను కత్తితో పొడిచిన భర్త

image

మానవ సంబంధాలు దారి తప్పుతున్నాయి. HYD శివారు, దుండిగల్ PS పరిధి డి.పోచంపల్లిలో డాక్టర్ బస్తీలో దారుణం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మద్యానికి బానిసైన భర్త సాదుల్లా, భార్య సాహిని(30)ని తాగడానికి డబ్బులు అడిగాడు. ఆమె నిరాకరించడంతో విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 4, 2026

HYD: స్మోకింగ్, ఆల్కహాల్‌తో క్యాన్సర్: డా.దుర్గాప్రసాద్

image

పర్యావరణ కాలుష్యం, స్మోకింగ్, ఆల్కహాల్ వ్యసనాలతో క్యాన్సర్ వస్తుందని GGH మహేశ్వరం ENT సర్జన్ డా.KVN దుర్గాప్రసాద్ అన్నారు. ‘ఆహారం, శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉన్నా, దగ్గితే రక్తం పడినా, గడ్డలు, పుండ్లు, దగ్గు తగ్గకపోవడం లక్షణాలు. గుడ్లు, ఆకుకూరలు, శనగపప్పు ఉండలు ఎక్కువ తీసుకోవాలి. ప్రొటీన్, విటమిన్లు శరీరానికి సరిగ్గా అందాలి. భయం వీడి చికిత్స తీసుకోవాలి’ అని సూచించారు.
నేడు వరల్డ్ క్యాన్సర్ డే

News February 4, 2026

స్వామి వివేకానంద HYD పర్యటనకు 133 ఏళ్లు

image

స్వామి వివేకానంద భాగ్యనగరానికి వచ్చి ఈ ఏడాదితో 133 ఏళ్లు పూర్తికావొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామకృష్ణ మఠం శాఖ ‘వివేక సూర్యోదయ సప్తాహం’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కార్యక్రమాలన్నీ సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ క్యాంపస్‌లోని వివేకానంద ఆడిటోరియంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చని మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద మహారాజ్ తెలిపారు. ఆయన ఇక్కడకి వచ్చినప్పుడు ఈ కాలేజీలోనే ప్రసంగించారు.

News February 4, 2026

బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్

image

హీరోయిన్ ఈషా రెబ్బా బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లపై కొందరు వ్యక్తులు అత్యంత అసభ్యకరంగా, కించపరిచేలా కామెంట్స్ చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా తన గౌరవానికి భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి, కఠినచర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.