News November 25, 2024
FLASH: భారీ విజయం దిశగా భారత్

పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆసీస్ భారీ ఓటమి దిశగా సాగుతోంది. 79 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. ఇక భారత్ గెలుపు లాంఛనమే. నాథన్ 0, ఖవాజా 4, కమిన్స్ 2, లబుషేన్ 3, స్టీవెన్ స్మిత్ 17 పరుగులకు ఔటయ్యారు. ట్రావిస్ హెడ్(45) క్రీజులో ఉన్నారు. బుమ్రా 2, సిరాజ్ 3 వికెట్లు పడగొట్టారు. కాగా ఆసీస్ ఇంకా 455 పరుగులు చేయాల్సి ఉంది.
Similar News
News November 19, 2025
సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

సినీ నటి తులసి యాక్టింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 31న షిర్డీకి వెళ్తున్నానని, ఆరోజు నుంచి సినిమాలకు దూరమై మిగిలిన జీవితాన్ని సాయిబాబాకు అంకితం చేస్తానని ఆమె పేర్కొన్నారు. తులసి 4వ ఏట నుంచి నటనా ప్రస్థానాన్ని మొదలెట్టారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సుమారు 300 సినిమాలు చేశారు. ‘శంకరాభరణం’లో బాలనటిగా మంచి గుర్తింపు పొందారు. యువ హీరోలకు తల్లి పాత్రల్లోనూ కనిపించి మెప్పించారు.
News November 19, 2025
వరి పంటకు అజొల్లా చేసే మేలు

అజొల్లా జీవన ఎరువు వరిపొలంలో నీటిపై తేలుతూ నత్రజనిని స్థిరీకరించి, వరిపైరుకు నత్రజనిని అందుబాటులోకి తీసుకొస్తుంది. వరి నాటిన వారం రోజుల తర్వాత సుమారు 2KGల అజోల్లా జీవన ఎరువును ఒక ఎకరంలో వెదజల్లి 15 నుంచి 20 రోజులు నీటిపై పెరగనివ్వాలి. తర్వాత నీటిని తొలగిస్తే ఇది 3-4 రోజుల్లో కుళ్లిపోయి నత్రజనిని, ఇతర పోషకాలను మొక్కలకు అందించి పంటకు మేలు చేస్తుంది. అజోల్లాను పచ్చిరొట్ట ఎరువుగానూ ఉపయోగించవచ్చు.
News November 19, 2025
పిల్లల్లో జలుబు తగ్గించే చిట్కాలు ఇవే

* పిల్లలను హైడ్రేట్ చేయడానికి గోరు వెచ్చని నీరు, సూప్స్, కొబ్బరి నీళ్లు ఇవ్వండి. దీనివల్ల వారి శరీరం ఎనర్జిటిక్‌గా ఉంటుంది. * తల కాస్త ఎత్తులో పెట్టుకుని పడుకునేలా చేయండి. * సెలైన్ నాజిల్ డ్రాప్స్ వాడండి. ఏడాది లోపు పిల్లల ముక్కులో నాలుగైదు గంటలకోసారి 2 డ్రాప్స్, అంతకంటే పెద్ద పిల్లల్లో 3-4 డ్రాప్స్ వేయండి. * విటమిన్-C ఉండే జామ, కివీ, ఆరెంజ్ పండ్లు ఇవ్వండి. దీనివల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.


