News November 22, 2024

FLASH: మార్చి 14 నుంచి IPL

image

IPLలో రాబోయే మూడు సీజన్లకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. IPL-2025 మార్చి 14న ప్రారంభం అవుతుంది. ఫైనల్ మే 25న జరుగుతుంది. పూర్తి షెడ్యూల్ త్వరలోనే రానుంది. ఇక 2026 IPL మార్చి 15- మే 31 మధ్య జరుగుతుంది. 2027 IPL మార్చి 14-మే 30 మధ్య జరుగుతుంది. కాగా ఈ సీజన్‌కు సంబంధించిన వేలంపాట ఈ నెల 24, 25 తేదీల్లో జరగనున్న విషయం తెలిసిందే.

Similar News

News December 4, 2025

సింగపూర్‌ లాంటి దేశాన్నీ ఇబ్బంది పెట్టారు: CM

image

AP: గత పాలకులు సింగపూర్‌ లాంటి దేశాన్ని, ఆ దేశ కంపెనీలను ఇబ్బంది పెట్టారని CM CBN విమర్శించారు. ‘ఆ బ్యాడ్ ఇమేజ్ చెరిపి బ్రాండ్ ఇమేజ్ తేవడంతో ఇపుడు పెట్టుబడులు వస్తున్నాయి. ఇటీవలి MOUలన్నీ 45 రోజుల్లో గ్రౌండ్ కావాలి. భూ సేకరణలో వివాదాలు రాకూడదు. భూములిచ్చిన వాళ్లు, తీసుకున్న వాళ్లు సంతోషంగా ఉండాలి’ అని అధికారులకు సూచించారు. UAE మాదిరి APలో ₹500 కోట్లతో సావరిన్ ఫండ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

News December 4, 2025

టోల్ ప్లాజాస్ @ 25 ఇయర్స్

image

దేశంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం(PPP)లో టోల్ ప్లాజాలు ఏర్పాటై 25 ఏళ్లు అయింది. ప్రభుత్వ రహదారులు, బ్రిడ్జిలపై టోల్ వసూలుకు 1851లో చట్టం చేశారు. 1970లలో దేశంలో రహదారుల నిర్మాణం, టోల్ వసూలు పద్ధతులు ప్రవేశపెట్టారు. 2000 నుంచి ప్రారంభమైన టోల్ ప్లాజాల ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏడాది భారీగా ఆదాయం వస్తోంది. 2024-25లో రూ.73 వేల కోట్లు వసూలవగా.. ఈ ఏడాది రూ.80 వేల కోట్లు వసూలు కావొచ్చని అంచనా.

News December 4, 2025

‘అఖండ-2’ మూవీ.. ఫ్యాన్స్‌కు బిగ్ షాక్

image

అఖండ2 ప్రీమియర్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న బాలయ్య ఫ్యాన్స్‌కు డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ షాకిచ్చింది. సాంకేతిక కారణాలతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలో ప్రీమియర్స్ ఉండవని 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించింది. ఓవర్సీస్‌లో మాత్రం యథావిధిగా ప్రీమియర్స్ ఉంటాయంది. ఇవాళ రాత్రి గం.8 నుంచి షోలు మొదలవుతాయని ప్రకటన వచ్చినా టికెట్స్‌పై సమాచారం లేక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.