News April 24, 2024
FLASH: జైస్వాల్ సూపర్ సెంచరీ

MIతో జరిగిన మ్యాచ్‌లో RR ప్లేయర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగారు. 59 బంతుల్లో 7 సిక్సులు, 8 ఫోర్ల సాయంతో కెరీర్లో రెండో ఐపీఎల్ శతకాన్ని బాదారు. ఈ సీజన్లో ఫామ్ లేక సతమతమవుతోన్న జైస్వాల్.. తిరిగి తన మార్క్ షాట్లతో అదరగొట్టారు.
Similar News
News December 18, 2025
మొబైల్ రీఛార్జ్‌లపై 20% పెంపు?

రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచేందుకు Jio, Airtel, VI సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2026 నాటికి ఈ కంపెనీలు తమ ప్రీపెయిడ్ & పోస్ట్‌పెయిడ్ టారిఫ్‌లను 16-20% వరకు పెంచే అవకాశం ఉందని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ ‘మోర్గాన్ స్టాన్లీ’ పేర్కొంది. గతంలో 2024 జులైలో ధరలు పెరగగా రెండేళ్ల విరామం తర్వాత 2026లో మరోసారి సామాన్యుల జేబుకు చిల్లు పడనుందని తెలిపింది. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
News December 18, 2025
నాకు ఇష్టమైన పదం.. టారిఫ్స్: ట్రంప్

రికార్డు స్థాయిలో $18 ట్రిలియన్ల పెట్టుబడులను అమెరికాకు తీసుకొచ్చానని ట్రంప్ అన్నారు. ఈ విజయంలో ఎక్కువ భాగం సుంకాల వల్లే సాధ్యమైందని చెప్పారు. ‘టారిఫ్స్ నాకు ఇష్టమైన పదం. ఇతర దేశాలు కొన్ని దశాబ్దాల పాటు టారిఫ్స్‌ను మనకు వ్యతిరేకంగా ఉపయోగించాయి. కానీ ఇప్పుడు అలా జరగబోదు’ అని చెప్పారు. అమెరికాలో తయారు చేస్తే టారిఫ్స్ ఉండవని కంపెనీలకు తెలుసని, అందుకే రికార్డు సంఖ్యలో ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు.
News December 18, 2025
కలబందతో చర్మానికి ఎన్నో లాభాలు

జిడ్డు చర్మం ఉన్నవారు తరచూ ముఖానికి కలబంద రాయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గి గ్లో వస్తుంది. సున్నిత చర్మం ఉన్నవారికి సన్ బర్న్, హీట్ రాషెస్ వంటి సమస్యలకు కలబంద బాగా పని చేస్తుంది. కలబంద, ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం సున్నితంగా మారడంతో పాటు, ముడతలను తగ్గిస్తుంది. చర్మం తక్షణ మెరుపు సంతరించుకోవాలంటే అలోవెరా జెల్, మామిడి గుజ్జు, నిమ్మరసం కలిపి ప్యాక్ వేసుకోవాలి.


