News April 13, 2024
FLASH: జనసేన యూట్యూబ్ ఛానల్ హ్యాక్

AP: ఎన్నికల వేళ జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్‌ను దుండగులు హ్యాక్ చేశారు. దాని పేరును మైక్రోస్ట్రాటజీగా మార్చి బిట్ కాయిన్‌కు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తున్నారు. దీనిపై జనసేన ఇంకా స్పందించలేదు. కాగా ఆ ఛానల్‌కు 14 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. పార్టీ కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ ప్రసంగాలను అందులో లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంటారు.
Similar News
News March 17, 2026
డీఎంకే బెదిరించిందని ఆరోపణలు.. స్పందించిన రజినీకాంత్

రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ సమయంలో డీఎంకే ఆయన్ను బెదిరించిందని టీవీకే నేత ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనం రేపాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ రజినీ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఆధవ్ అర్జున వ్యాఖ్యల్లో నిజం లేదు. ఆయన వ్యాఖ్యలను ఖండించి నాకు మద్దతుగా నిలిచిన నేతలకు, అభిమానులకు ధన్యవాదాలు. కాలం మాట్లాడకపోవచ్చు. కానీ వేచి ఉండి సమాధానం ఇస్తుంది’ అని పేర్కొన్నారు.
News March 17, 2026
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన!

LPG వినియోగదారుల్లో eKYCపై నెలకొన్న గందరగోళంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఇప్పటివరకు eKYC పూర్తి చేయనివారు మాత్రమే చేసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసుంటే మళ్లీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ‘ఉజ్వల లబ్ధిదారులు మాత్రం ఏడాదికి ఒకసారి చేయాలి. అది కూడా 8, 9వ రీఫిల్స్‌పై సబ్సిడీ పొందడానికి ఇది అవసరం. దీనివల్ల గ్యాస్ సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండదు’ అని పేర్కొంది.
News March 17, 2026
కాసేపట్లో వర్షం

TG: రాష్ట్రంలో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటల లోపు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 41-61కి.మీ మధ్య గాలులు వీయడంతో పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని పేర్కొంది.


