News June 19, 2024
FLASH: APలో భారీగా IASల బదిలీ

ఏపీలో భారీగా IASలు బదిలీ అయ్యారు. పురపాలకశాఖ, ఎక్సైజ్, పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శులు శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాశ్లను ప్రభుత్వం జీఏడీకి అటాచ్ చేసింది. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్లను నియమించింది.
Similar News
News September 14, 2025
కొందరు MLAలు అసెంబ్లీకి రాకున్నా జీతం తీసుకుంటున్నారు: అయ్యన్న

AP: కొందరు MLAలు అసెంబ్లీకి రాకపోయినా జీతం తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ‘ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికే. ఉద్యోగాలకు రాకపోతే ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాం. అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్సభ స్పీకర్ ఆలోచించి, మార్గదర్శకాలివ్వాలి. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేది 45రోజులు.. వాటికీ రాకపోతే ఎలా’ అని ప్రశ్నించారు.
News September 14, 2025
మొటిమలకు ఇవే కారణాలు..

అమ్మాయిలను మొటిమలు చాలా ఇబ్బంది పెడతాయి. వాటికి ఎన్నో కారణాలుంటాయి. రాత్రిళ్లు కార్టిసాల్ స్థాయులు తగ్గి, కొల్లాజెన్ ఉత్పత్తై చర్మాన్ని రిపేర్ చేస్తుంది. మేకప్ తీయకుండా నిద్రపోతే చర్మరంధ్రాల్లో మేకప్ అవశేషాలు ఉండి మొటిమలొస్తాయి. పిల్లోకవర్స్ ఉతక్కపోయినా చర్మం విడుదల చేసే నూనెలు, చెమట, బ్యాక్టీరియా, మృతకణాల వల్ల ఈ సమస్య వస్తుంది. తలకు నూనె రాసుకొని పడుకుంటే అది సీబమ్ ఉత్పత్తిని పెంచుతుంది.
News September 14, 2025
కలెక్షన్లలో దుమ్మురేపుతోన్న ‘మిరాయ్’

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఫాంటసీ మూవీ ‘మిరాయ్’ కలెక్షన్లలో దుమ్మురేపుతోంది. ఈ చిత్రం రెండు రోజులకు వరల్డ్ వైడ్గా ₹55.60 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. పాజిటివ్ టాక్ రావడం, వీకెండ్ కూడా కావడంతో వసూళ్లు ఇంకా పెరుగుతాయని వారు భావిస్తున్నారు. మంచు మనోజ్ కీలక పాత్రలో, రితికా నాయక్ హీరోయిన్గా నటించారు.