News September 20, 2025
బీచ్ ఫెస్టివల్ ప్రమోట్ చేసేలా ఫ్లాష్ మాబ్

AP: SEP 26, 27, 28 తేదీల్లో బాపట్ల(D) సూర్యలంక బీచ్‌లో నిర్వహించే బీచ్ ఫెస్టివల్‌కు వినూత్న ప్రచారం కల్పించేందుకు టూరిజం శాఖ సిద్ధమైంది. రాష్ట్రంలోని వర్సిటీల భాగస్వామ్యంతో సూర్యలంక, VJA, TPT, RJY, GNT, HYDలో ఫ్లాష్ మాబ్ నిర్వహించనున్నారు. వీటిలో పాల్గొన్న విద్యార్థులను SEP 27న వరల్డ్ టూరిజం డే రోజు CM చంద్రబాబు సత్కరిస్తారు. బీచ్ ఫెస్టివల్‌లో వాటర్ స్పోర్ట్స్, సీ పుడ్ ఆకర్షణగా నిలువనున్నాయి.
Similar News
News September 20, 2025
2,569 మందికి కారుణ్య నియామకాలు: లోకేశ్

AP: రాష్ట్రంలో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాల కింద పోస్టింగులు ఇచ్చినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. మొత్తం 3,441 మంది నుంచి అప్లికేషన్స్ రాగా.. వారిలో 2,569 మందికి కారుణ్య నియామకాల కింద పోస్టింగులు ఇచ్చినట్లు వెల్లడించారు.
News September 20, 2025
ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు

AP: రాయలసీమలో ఇవాళ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. కర్నూలు, నంద్యాల, ATP, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు-భారీ వర్షాలు, శ్రీకాకుళం, VZM, అల్లూరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది. SEP 26న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది.
News September 20, 2025
పాల ప్రొడక్టుల ధరలు తగ్గింపు

AP: GST తగ్గడంతో తమ ఉత్పత్తులపై ధరలు తగ్గిస్తున్నట్లు సంగం, విజయ డెయిరీలు ప్రకటించాయి. సంగం డెయిరీ UHT పాలు లీటరుపై రూ.2, పనీర్ కిలో రూ.15, నెయ్యి-వెన్న కిలోకి రూ.30, బేకరి ప్రొడక్టులు కిలోపై రూ.20 మేర తగ్గించనుంది. విజయ డెయిరీ టెట్రాపాలు లీటరు రూ.5, ఫ్లేవర్డ్ మిల్క్ లీటరుకు రూ.5, పన్నీర్ కిలో రూ.20, వెన్న-నెయ్యిపై కిలోకి రూ.30 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు SEP 22 నుంచి అమలులోకొస్తాయి.