News August 31, 2024
FLASH: NLG, SRPT, YDD జిల్లాలకు PINK ALERT⚠️

నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ మూడు జిల్లాలకు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Similar News
News November 11, 2025
NLG: 50% సిలబస్ ఇంకా అలానే..!

ఇంటర్ సిలబస్ పూర్తికాక విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 140 ఉన్నాయి. వాటిలో 12,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు కొన్ని కాలేజీల్లో 50% సిలబస్ కూడా పూర్తి కాలేదని తెలుస్తుంది. ఐదు నెలల్లో కేవలం 50 శాతం మాత్రమే సిలబస్ పూర్తి అయింది.
News November 11, 2025
NLG: పంట పండింది.. సేకరణ ఇలా

NLG జిల్లాలో ధాన్యం సేకరణ సాఫీగా కొనసాగుతోంది. జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో రైతులు 5,26,796 ఎకరాల్లో వరి సాగు చేయగా.. 2,56,665 ఎకరాల్లో సాధారణ, 2,70,131ఎకరాల్లో సన్నరకం సాగు చేశారు. తద్వారా 13,44,268 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యం 4,73,036 టన్నులు పోగా.. అమ్మకానికి 6,30,981 మెట్రిక్ టన్నుల కొనుగోలు కేంద్రాలకు వస్తుందని వ్యవసాయ శాఖ లెక్కలు వేస్తోంది.
News November 11, 2025
NLG: ధాన్యం సేకరణ నిబంధనల ఉల్లంఘన: ఇద్దరు అధికారులు సస్పెండ్!

ధాన్యం సేకరణ నియమాలను ఉల్లంఘించినందుకుగాను నల్గొండ జిల్లా, మిర్యాలగూడ, ఆలగడప క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి కుమారి అఫీసర్ను, అలాగే అవంతిపురం ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జి కె.సైదులును విధుల్లోంచి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సహకార అధికారి పత్యా నాయక్ విచారణ జరిపి నివేదిక సమర్పించారు.


