News February 16, 2026
FLASH: NZB మేయర్‌గా కూరగాయల ఉమారాణి

నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్‌గా కాంగ్రెస్ నుంచి 49వ డివిజన్‌లో గెలుపొందిన కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఆమె భర్త కరాటే రమేశ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు నమ్మిన బంటుగా ఉన్నారు. ఎన్నికకు హాజరైన మెజారిటీ సభ్యులు ఆమెకు మద్దతు తెలిపారు. ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆమెకు ఎక్స్ అఫీషియోగా ఓటు వేశారు.
Similar News
News March 17, 2026
ఇరాన్ సుప్రీంలీడర్ స్వలింగ సంపర్కుడు: US

ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ స్వలింగ సంపర్కుడని US ఇంటెలిజెన్స్ భావిస్తోంది. తన చైల్డ్‌హుడ్ ట్యూటర్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు అంచనా వేస్తోంది. ఇదే విషయాన్ని ట్రంప్‌తో చెప్పగానే ఆయన ఆశ్చర్యంతో బిగ్గరగా నవ్వాడని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. వికీలీక్స్‌లోనూ ఓ ఇరాన్ లీడర్ నపుంసకత్వానికి చికిత్స కోసం UKకు వెళ్లినట్లు పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించింది. కాగా ఇరాన్‌లో స్వలింగ సంపర్కం నేరం.
News March 17, 2026
సర్కారు ‘లేజర్’ కన్ను.. మీ ఇంటి గుట్టు రట్టు..!

మూడు కార్పొరేషన్ల(GHMC, MMC, CMC) పరిధిలో ఆకాశం నుంచి లేజర్ కిరణాలతో అంగుళం, అంగుళం రికార్డు చేస్తున్నారు. ఇది అక్రమ కట్టడాల పాలిట యమపాశంగా మారనుంది. ముసీ తీరంలో గూడు కట్టుకున్న 1400 కుటుంబాలకు ఇప్పుడు కంటిమీద కునుకు లేదు. హైడ్రా చేతిలో ఈ డేటా ఉందంటే ఎప్పుడు ఏ JCB వచ్చి తలుపు తడుతుందోనన్న భయం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కట్టుకున్న ఇల్లు ఎప్పుడు కూలుతుందేమోనని సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు.
News March 17, 2026
GNT: నాటకరంగ దిగ్గజం పెద్ది రామారావు

రచయిత పెద్ది రామారావు గుంటూరు జిల్లా ఉన్నవ గ్రామంలో 1973 మార్చి 17న జన్మించారు. ఆయన హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో నాటకరంగంలో పీహెచ్‌డీ చేశారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ప్రసిద్ధ ‘ఋతురాగాలు’ సీరియల్‌కు ఆయన మాటల రచయితగా పనిచేశారు. ‘యవనిక’ అనే నాటక మాసపత్రికను నడిపి నాటకరంగానికి ఎనలేని సేవ చేశారు. చిరంజీవి ‘అందరివాడు’, ఎన్టీఆర్ ‘అశోక్’ సినిమాలకు ఆయన సహ రచయితగా కూడా వ్యవహరించారు.


