News June 17, 2024

FLASH: డిసెంబర్ 6న ‘పుష్ప2’ విడుదల

image

అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2’ కొత్త రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. 2024 డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్న కారణంగా తొలుత ప్రకటించిన ఆగస్టు 15న సినిమా విడుదల చేయలేకపోతున్నామని వివరించింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప1’ సెన్సేషన్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.

Similar News

News November 28, 2025

వరంగల్: ఉద్దండులంతా సర్పంచ్‌లే!

image

రాజకీయాలకు ఉమ్మడి WGL పెట్టింది పేరు. గ్రామ నుంచి ఢిల్లీ స్థాయివరకు ఎదిగిన నాయకులు ఎందరో ఉన్నారు. మాజీ మంత్రి DS రెడ్యానాయక్ 1981లో మరిపెడ(M) ఉగ్గంపల్లి సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మాజీ MP సురేందర్ రెడ్డి 1959లో మరిపెడ సర్పంచ్‌గా పనిచేశారు. BHPL MLA గండ్ర సత్యనారాయణ రావు 1984లో గణపురం(M) బుద్దారం సర్పంచ్‌గా, NSPT MLA మాధవరెడ్డి 1981లో చెన్నరావుపేట(M) అమీనాబాద్ సర్పంచ్‌గా చేశారు.

News November 28, 2025

మహిళల్లో ఊబకాయంతో పక్షవాతం ముప్పు

image

టీనేజ్ నుంచి అధికబరువుతో బాధపడుతున్న మహిళలకు 55 ఏళ్లలోపు పక్షవాతం వచ్చే ముప్పు పెరుగుతున్నట్లు అమెరిన్‌ స్ట్రోక్‌ అసోసియేషన్‌ పరిశోధనలో వెల్లడైంది. చిన్న వయసు నుంచి పెద్దయ్యే దాకా ఊబకాయం లేనివారితో పోలిస్తే.. ఏదో ఒక వయసులో ఊబకాయం ఉన్నవారిలో ముందుగానే పక్షవాతం వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారు. దీంతోపాటు షుగర్‌, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుందని అంటున్నారు.

News November 28, 2025

గ్రీన్‌కార్డ్ ఇంటర్వ్యూకు వెళ్తే అరెస్ట్ చేస్తున్న పోలీసులు

image

గ్రీన్‌కార్డు ఇంటర్వ్యూలకు వెళ్లిన విదేశీ పౌరులను అరెస్టు చేస్తున్నారు. శాన్ డియాగోలో వీసా ఇంటర్వ్యూకు వెళ్లిన తన క్లయింట్స్ ఐదుగురిని అరెస్టు చేసినట్టు ఓ లాయర్ చెప్పారు. అరెస్టైన వారంతా US సిటిజన్ల జీవితభాగస్వాములని, వీసా గడువు ముగిసినా ఎటువంటి క్రిమినల్ కేసులు వారిపై లేవన్నారు. ఇంటర్వ్యూకు వచ్చిన వారిలో వీసా గడువు ముగిసిన వారిని అరెస్ట్ చేస్తున్నట్టు ఇమ్మిగ్రేషన్ అటార్నీ నస్సేరీ తెలిపారు.