News December 26, 2024
FLASH: వర్షం

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని కొన్ని ఏరియాలతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో వాన పడుతోంది. కాగా నిన్నటి నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. మబ్బులు ఏర్పడి వెదర్ చల్లగా మారింది. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరి మీ ప్రాంతంలోనూ వర్షం కురుస్తోందా?
Similar News
News November 21, 2025
iBOMMA రవి విచారణలో కీలక విషయాలు

iBOMMA రవి రెండో రోజు విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సమాచారం సేకరించారు. తమిళ, హిందీ వెబ్సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసిన రవి క్రిప్టో ద్వారా పేమెంట్ చేసినట్లు గుర్తించారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌ను బెట్టింగ్ యాప్స్‌కు గేట్వేగా ఉపయోగించి వచ్చిన డబ్బులతో సినిమాలు కొనుగోలు చేసినట్లు కనుగొన్నారు. కరీబియన్ దీవుల్లో ఆఫీసు ఏర్పాటు చేసి, 20 మందితో కంటెంట్‌ను అప్లోడ్ చేయిస్తున్నట్లు తేల్చారు.

టార్గెట్ 1 రన్.. భారత్ ఘోర ఓటమి

ACC మెన్స్ ఆసియా రైజింగ్ స్టార్స్ టోర్నీ <<18351488>>సెమీస్‌లో<<>> బంగ్లా-Aతో జరిగిన మ్యాచులో భారత్-A చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా సున్నాకే 2 వికెట్లు కోల్పోయింది. ఒక పరుగు టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లా తొలి బంతికి వికెట్ కోల్పోయింది. తర్వాతి బంతిని బౌలర్ సుయాష్ శర్మ వైడ్ వేయడంతో బంగ్లా గెలిచింది. ఈ ఓటమితో భారత్-A జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.