News March 6, 2025
FLASH: RGVకి హైకోర్టులో ఊరట

AP: డైరెక్టర్ ఆర్జీవీకి హైకోర్టులో ఊరట లభించింది. సీఐడీ నమోదు చేసిన కేసులపై స్టే విధించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. 2019లో విడుదలైన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై 2024లో కేసు నమోదు చేయడమేంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. కాగా రాజకీయ దురుద్దేశంతోనే తనపై FIR నమోదు చేశారని, దీన్ని కొట్టేయాలని ఆయన కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Similar News
News November 6, 2025
వేదాల్లో ఏముంటాయి? వాటినెందుకు చదవాలి?

సంతోషం కోసం వేదాలు చదవాలి. ఇందులో ప్రధానంగా 4 విషయాలు ఉన్నాయి.
1. ఐహిక సుఖాలను, ఆనందాలను పొందేందుకు ఉపాయాలు.
2. దేవతల అనుగ్రహం కోసం పాటించవలసిన వివిధ ఉపాసనలు, పద్ధతులు.
3. జీవిత అంతిమ లక్ష్యమైన మోక్షాన్ని సాధించడానికి మార్గదర్శకమైన వచనాలు.
4. నేటి ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలకు మూలాలైన అనేక ప్రాథమిక సూత్రాలు. <<-se>>#VedikVibes<<>>
News November 6, 2025
నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన!

నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతోందని APSDMA పేర్కొంది. ఇవాళ కృష్ణా, ప్రకాశం, NLR, ATP, కడప, చిత్తూరు, TPT జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలో ఉ.8.30 గంటల వరకు ఆదిలాబాద్, నిర్మల్, మహబూబ్‌నగర్, నారాయణ్‌పేట్, నల్గొండ, నిజామాబాద్, వనపర్తి, గద్వాల, RR, HYD, మల్కాజ్‌గిరి, వికారాబాద్ ప్రాంతాల్లో వర్షం కురిసే ఛాన్సుందని HYD IMD తెలిపింది.
News November 6, 2025
జ్ఞానాన్ని ప్రసాదించే వ్యాస మంత్రం

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||3||
వసిష్ఠుడికి మునిమనవడు, శక్తి మహామునికి మనుమడు, పరాశరుడికి పుత్రుడు, పరమ పవిత్రుడు, గొప్ప తపస్సు సంపద కలిగినవాడు, శుకమహర్షి తండ్రి అయిన ఆ వేదవ్యాస మహర్షికి మనం నమస్కరించాలి. ఆ వ్యాసుడి గొప్ప వంశాన్ని, పవిత్రతను స్మరించుకొని, పూజించడం వలన ఆయనలా జ్ఞానం లభిస్తుందని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


