News September 7, 2024
FLASH: ఆర్టీసీ బస్సు బోల్తా

AP: శ్రీసత్యసాయి జిల్లా గుమ్మలకుంట దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సు ముందు టైర్ పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 12, 2025
పంచాయతీ ఎన్నికల్లో 84.28% ఓటింగ్

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 84.28% పోలింగ్ నమోదైంది. 53.57లక్షల ఓటర్లకు గానూ 45.15లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 92.88%, అత్యల్పంగా భద్రాద్రి జిల్లాలో 71.79% ఓటింగ్ నమోదైంది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోనూ 90శాతం మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్ధరాత్రి వరకు 3,300 సర్పంచ్, 24,906 వార్డు స్థానాల్లో కౌంటింగ్ పూర్తైంది.
News December 12, 2025
కొబ్బరికాయకు కుంకుమ పెడుతున్నారా?

హిందూ సంప్రదాయంలో పూజలు, శుభకార్యాలప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీ. అయితే దేవుడికి నైవేద్యంగా సమర్పించే కొబ్బరిపై కుంకుమ బొట్టు పెట్టకూడదని పండితులు సూచిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం శుద్ధత అని, దేవుడికి సమర్పించే ప్రసాదం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలని అంటున్నారు. తెల్లటి గుజ్జుపై కుంకుమ ఉంచడం వల్ల తినదగిన నైవేద్యం స్వచ్ఛత దెబ్బతింటుందని, కావాలంటే పీచుపై పెట్టాలని సూచిస్తున్నారు.
News December 12, 2025
నేడు విశాఖలో 9 IT సంస్థల క్యాంపస్లకు భూమిపూజ

AP: కాగ్నిజెంట్, సత్వా గ్రూప్తో పాటు విశాఖలో మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్ల నిర్మాణాలకు నేడు CM CBN, మంత్రి లోకేశ్ భూమిపూజ చేయనున్నారు. మధురవాడలో 1.టెక్ తమ్మిన, 2.నాన్ రెల్ టెక్నాలజీస్, 3.ACN ఇన్ఫోటెక్, కాపులుప్పాడలో 4.ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్, 5.ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, 6.మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్, 7.క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రై. లిమిటెడ్ సంస్థలకు శంకుస్థాపనలు జరగనున్నాయి.


