News February 25, 2025
FLASH: నర్సంపేట: చింత చెట్టు కూలి ఒకరి మృతి

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మాదన్నపేట గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సుంచు రవిపై మంగళవారం చింత చెట్టు కూలింది. తీవ్ర గాయాల పాలైన రవి అక్కడికక్కడే మృతిచెందాడు. రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 22, 2025
వరంగల్: మూడు జిల్లాల్లో విస్తరించిన ‘పాకాల’

పాకాల అభయారణ్యం అంటే ఒక్క వరంగల్ జిల్లానే అనుకుంటారు. నిజానికి పాకాల అడవి 839 చ.కి.మీ విస్తీర్ణంతో వరంగల్‌తో పాటు మహబూబాబాద్, ములుగు జిల్లాలోనూ విస్తరించి ఉంది. వివిధ రకాల జంతువులు, పక్షులు, సరీసృపాలకు అనువైనదిగా ఉంది. శీతాకాలంలో విదేశీ పక్షులు సైతం ఇక్కడ సందడి చేస్తాయి. నర్సంపేటకు 9 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాకాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సందర్శకులు వస్తుంటారు.
News April 22, 2025
వరంగల్ చపాటా అంటే నర్సంపేటనే..!

చపాటా మిర్చి పంట సాగుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పెట్టింది పేరు. కానీ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా సాగయ్యేది నర్సంపేట నియోజకవర్గంలో మాత్రమే. విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఈ చపాటా మిర్చిని మొదట నల్లబెల్లికి చెందిన రైతులు సాగు చేశారు. తర్వాత నల్లబెల్లి, నర్సంపేట, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ తదితర మండలాల్లోని రైతులు ఈ రకం మిర్చి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఈ మిర్చికి భౌగోళిక గుర్తింపు వచ్చింది.
News April 21, 2025
WGL: 9,970 GOVT జాబ్స్.. లైబ్రరీలకు నిరుద్యోగుల క్యూ

సికింద్రాబాద్ సహా పలు రైల్వే రీజియన్లలో 9,970అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల నోటిఫికేషన్ రావడంతో WGL,HNK,JN,MHBD,BHPL,MLGలోని లైబ్రరీలకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. సిలబస్ బుక్స్‌తో కసరత్తు చేస్తున్నారు. కొందరేమో HYDకు వెళ్లి కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్నారు. ఆన్‌లైన్ అప్లికేషన్‌కు మే 11 చివరి తేదీ. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281