News April 3, 2025
FLASH: వనపర్తి జిల్లాలో యాక్సిడెంట్

వనపర్తి జిల్లా పెబ్బేర్‌లో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక భవాని వైన్స్ ఎదురుగా నడుచుకుంటూ వెళ్తున్న కంచిరావుపల్లి గ్రామానికి చెందిన విష్ణుచారిని AP39UC7200 నంబర్ గల లారీ వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విష్ణు చేయి, కాలు నుజ్జునుజ్జయింది. పెబ్బేర్ ఎస్ఐ యుగంధర్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి క్షతగాత్రుడిని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Similar News
News April 10, 2025
నేనెప్పటికీ తలా ఫ్యానే: అంబటి రాయుడు

CSK, ఎంఎస్ ధోనీకి మద్దతుగా మాట్లాడుతున్నారంటూ తనపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌కు అంబటి రాయుడు కౌంటర్ ఇచ్చారు. ‘నేనెప్పటికీ తలా అభిమానినే. ఎవరేమనుకున్నా, ఏం చేసినా ఫర్వాలేదు. ఇందులో ఏమాత్రం తేడా ఉండదు. కాబట్టి పెయిడ్ పీఆర్ కోసం డబ్బులు ఖర్చు చేయడం ఆపేయండి. ఆ డబ్బుల్ని పేదలకు డొనేట్ చేయండి’ అని ట్వీట్ చేశారు.
News April 10, 2025
రాయచోటిలో గ్యాంగ్ వార్.. 9 మంది అరెస్ట్

రాయచోటిలో జరిగిన గ్యాంగ్ వార్ కేసులో 9 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. పరారీలో వున్న మరో 15 మంది నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. నిందితుల నుంచి 5 కట్టెలు, 3ఇనుప రాడ్లు, ఒక చైను, 9 సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పాతకక్షల నేపథ్యంలో10రోజుల క్రితం శివాలయం వద్ద ఇరు వర్గాలు ఘర్షణకు పాల్పడిన సంగతి తెలిసిందే.
News April 10, 2025
HYD: సామూహిక సీమంతాల్లో పాల్గొన్న కలెక్టర్

హిమాయత్‌నగర్ సెక్టార్ బీమా మైదాన్ అంగన్‌వాడీ కేంద్రంలో జరిగిన సామూహిక సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ‘గర్భిణులకు సరైన పోషకాహారం అత్యవసరం. అంగన్వా డీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. శిశు ఆరోగ్యం దేశ భవిష్యత్తు ఆధారం’ అని కలెక్టర్ పేర్కొన్నారు. DWO అక్కేశ్వరరావు, CDPO కృష్ణ చైతన్య, సూపర్‌వైజర్ బాలా, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.