News November 8, 2024

DSC ఎంపికలో లోపాలు.. ఏడుగురు తొలగింపు

image

TG: DSC-2024లో ఎంపికైన ఏడుగురు హిందీ పండిట్‌లను ఖమ్మం జిల్లాలో తొలగించడం కలకలం రేపుతోంది. 1:3 నిష్పత్తిలో అర్హత సాధించిన వారిలో కొందరికి అర్హత లేదని ఫిర్యాదు అందగా, వెరిఫికేషన్‌లో క్లీన్‌చిట్ వచ్చింది. 20 రోజులు ఉద్యోగం కూడా చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఎంపిక కాని అభ్యర్థులు కలెక్టర్, డీఈవోకు ఫిర్యాదు చేయగా, డిగ్రీలో ప్రత్యేక సబ్జెక్టుగా హిందీ లేదని విచారణలో బయటపడింది. దీంతో వారిని తొలగించారు.

Similar News

News November 8, 2024

జగన్ తన ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని బయట పెడుతున్నారు: జీవీ

image

APలో నేరాలు తగ్గి శాంతి నెలకొనాలంటే జగన్‌నే అరెస్ట్ చేయాలని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వ్యాఖ్యానించారు. డీజీపీని బెదిరించడం చూస్తుంటే జగన్ తన క్రిమినల్, ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వాన్ని బయట పెట్టుకుంటున్నారని అన్నారు. రౌడీలను రెచ్చగొడుతూ రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేయాలనే కుట్రలు జరుగుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. రౌడీ షీటర్లు, హంతకులను జైళ్లకు పంపిస్తే YCP దాదాపు ఖాళీ అవుతుందని చెప్పారు.

News November 8, 2024

AMUపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

image

UPలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(AMU)పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం AMUకి మైనార్టీ హోదా కొనసాగించవచ్చని CJI చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 4:3తో తీర్పు ఇచ్చింది. రెగ్యులర్ బెంచ్ ఈ అంశంపై తుది తీర్పు ఇస్తుందని పేర్కొంది. 1875లో ప్రారంభించిన ఈ సంస్థ 1920లో సెంట్రల్ యూనివర్సిటీగా మారగా, ఆ తర్వాత 1951లో ముస్లిం యూనివర్సిటీగా రూపాంతరం చెందింది.

News November 8, 2024

సీ ప్లేన్‌లో చంద్రబాబు శ్రీశైలం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు రేపు సీ ప్లేన్‌లో శ్రీశైలం పర్యటనకు వెళ్లనున్నారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలో టేకాఫ్ తీసుకుని శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద ల్యాండ్ అవుతారు. ఆ తర్వాత మల్లన్న ఆలయానికి చేరుకుని భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. కాగా తిరుమల తరహాలో శ్రీశైలాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించనున్నారు.