News September 10, 2024
హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు

TG: HYDలోని హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ GHMC అధికారులు, పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు అనుమతి లేదంటూ ట్యాంక్ బండ్ వైపు ఫ్లెక్సీలు పెట్టారు. పెద్ద ఎత్తున ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. కాగా ఏటా నగరం నలువైపుల నుంచి భారీగా వినాయక విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News July 6, 2025
ఆంధ్ర మూలాలున్న పత్రికలను మేమెందుకు చదవాలి?: RSP

‘తెలంగాణ BRS జాగీరా?’ అంటూ వచ్చిన ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ ఫైరయ్యారు. తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ‘తెలంగాణ జ్యోతి’గా పేరు మార్చుకోకుండా సర్కులేట్ అవుతోందని మండిపడ్డారు. విశాలాంధ్ర మన తెలంగాణగా, ప్రజాశక్తి నవ తెలంగాణగా పేరు మార్చుకున్నాయని గుర్తు చేశారు. ఆంధ్ర పాలకుల తొత్తులకు వెన్నంటి నిలిచే ఆంధ్రమూలాలున్న పత్రిక/ఛానళ్లను TG ప్రజలు ఎందుకు చదవాలని ప్రశ్నించారు.
News July 6, 2025
ఆ హక్కు దలైలామాకు లేదు: చైనా రాయబారి

తన వారసుడిని ఎంపిక చేసే హక్కు బౌద్ధ మత గురువు దలైలామాకు లేదని భారత్లోని చైనా రాయబారి షూ ఫెయిహాంగ్ స్పష్టం చేశారు. పునర్జన్మ విధానంలో దలైలామా ఓ భాగం మాత్రమేనని ఎక్స్లో ట్వీట్ చేశారు. ‘ప్రస్తుతం చైనా టిబెట్, సిచువాన్, యునాన్, గన్సు, క్విగ్ హాయ్ ప్రావిన్సుల్లో 1,000 రకాల పునర్జన్మ విధానాలు అనుసరిస్తున్నారు. ఈ సంప్రదాయాలు దలైలామాతో ప్రారంభం కాలేదు. అలాగే అంతం కూడా కాలేదు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
News July 6, 2025
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

TG: తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే 2.50 లక్షల ఇళ్ల పనులు చకచకా జరుగుతున్నాయన్నారు. కొత్తగూడెంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల జారీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అర్హులైనా, ఇళ్లు రానివారు నిరుత్సాహపడొద్దన్నారు. రాబోయే రోజుల్లో మిగతావారికి విడతలవారీగా కేటాయిస్తామని తెలిపారు. BRSలా ఊహజనిత మాటలు తాము చెప్పబోమన్నారు.