News February 6, 2025

US నుంచి భారత్‌కు ఫ్లైట్.. ఏ రాష్ట్రం వారు ఎందరున్నారంటే?

image

మన దేశానికి చెందిన కొందరిని US అక్రమ వలసదారులుగా గుర్తించి సైనిక విమానంలో తిరిగి పంపిన విషయం తెలిసిందే. టెక్సాస్ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు ఈ మధ్యాహ్నం విమానం రాగా అందులో 104 మంది భారతీయులున్నారు. వారిలో 30మంది పంజాబ్, 33మంది హరియాణా, 33మంది గుజరాత్ వాసులున్నారు. వీరితో పాటు MHకు చెందిన ముగ్గురు, UPకి చెందిన ముగ్గురు, చంఢీగఢ్‌ వాసులు ఇద్దరు ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Similar News

News February 6, 2025

భారత్‌తో శాంతి కోరుకుంటున్నాం.. కానీ: పాక్ పీఎం షరీఫ్

image

శాంతి పేరుతో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి సన్నాయి నొక్కులు నొక్కారు. కశ్మీర్ సహా అన్ని సమస్యలను భారత్‌తో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామని చెప్పారు. అయితే 2019 ఆగస్టు 5 నాటి ఆలోచన(ఆర్టికల్ 370 రద్దు) నుంచి బయటకు రావాలన్నారు. POK అసెంబ్లీలో మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితికి ఇచ్చిన వాగ్దానాన్ని భారత్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

News February 6, 2025

ఫిబ్రవరి 6: చరిత్రలో ఈరోజు

image

✒ 1890: స్వాతంత్ర్య సమర యోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జననం
✒ 1931: సమరయోధుడు మోతిలాల్ నెహ్రూ మరణం
✒ 1932: రచయిత భమిడిపాటి రామగోపాలం జననం
✒ 1947: ప్రముఖ రచయిత్రి కె.వి.కృష్ణకుమారి జననం
✒ 1956: AP అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్ ప్రతిభా భారతి జననం
✒ 2008: హాస్యనటి కల్పనా రాయ్ మరణం
✒ 2022: సింగర్ లతా మంగేష్కర్ మరణం(ఫొటోలో)

News February 6, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

error: Content is protected !!