News January 23, 2025
హైదరాబాద్ నుంచి వియత్నాంకు విమాన సర్వీస్

TG: మార్చి 18 నుంచి హైదరాబాద్, వియత్నాం మధ్య విమాన సర్వీస్ అందుబాటులోకి రానుంది. వియట్జెట్ సంస్థ నడిపే ఈ విమాన సర్వీసులు వారంలో రెండు రోజులు(మంగళ, శనివారం) మాత్రమే అందుబాటులో ఉంటాయి. హోచిమన్ సిటీ(వియత్నాం) నుంచి రాత్రి 7.40కు బయల్దేరే ఫ్లైట్ రాత్రి 10.35కు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుతుంది. రాత్రి 11.35కు శంషాబాద్‌లో బయల్దేరి, తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు వియత్నాం చేరుతుంది.
Similar News
News November 26, 2025
బండవతపురంలో రిజర్వేషన్ గందరగోళం

WGL జిల్లా వర్ధన్నపేట మండలం బండవతపురం గ్రామంలో మొత్తం 1,550 ఓట్లు ఉండగా సర్పంచ్ స్థానం జనరల్‌కు కేటాయించారు. గ్రామంలో 10 వార్డుల్లో 5 జనరల్, 5 ఎస్సీ రిజర్వ్ చేశారు. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక్క వార్డూ బీసీ కేటగిరీకి రాకపోవడంతో గ్రామ రాజకీయాలు వేడెక్కాయి. బీసీ ఓటర్లు ఉన్నచోట ఎస్సీ, ఎస్సీ ఓటర్లు ఉన్నచోట జనరల్ వార్డులు రావడం గందరగోళానికి దారి తీసింది. దీంతో నువ్వా? నేనా? అన్నట్టుగా ఉంది.

పీస్ ప్లాన్ ఫైనల్ అయ్యాకే పుతిన్, జెలెన్స్కీతో భేటీ: ట్రంప్

రష్యా, ఉక్రెయిన్ మధ్య వీలైనంత త్వరగా శాంతి నెలకొంటుందని భావిస్తున్నట్లు US ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. యుద్ధాన్ని ముగించేందుకు వారం రోజులుగా పీస్ ప్లాన్‌పై వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. US ప్రతిపాదించిన 28 పాయింట్ల ప్లాన్‌కు ఇరు దేశాలు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాయని, కొన్నింటికి అంగీకారం రావాల్సి ఉందన్నారు. ఈ డీల్ ఫైనల్ అయ్యాకే పుతిన్, జెలెన్స్కీతో సమావేశం అవుతానని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.