News April 2, 2024

విమాన సర్వీసులు తగ్గించిన విస్తారా

image

పైలట్లు, సిబ్బంది కొరత సహా ఇతర కారణాలతో విమాన సర్వీసులు తగ్గిస్తున్నట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ విస్తారా ప్రకటించింది. కొన్ని రోజులుగా విమానాల ఆలస్యానికి కారణం ఇదేనని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా టాటాకు చెందిన ఎయిర్ ఇండియాలో విస్తారా త్వరలో విలీనం కానుంది. ఇప్పటికే విస్తారాలో టాటా సన్స్‌కి 51% వాటా ఉంది. విలీనం పూర్తైతే ఈ సంస్థలు టాటా గ్రూప్‌లోని ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలోనే పని చేస్తాయి.

Similar News

News October 6, 2024

రజినీ-మణిరత్నం కాంబోలో సినిమా?

image

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు మణిరత్నం కలిసి చివరిగా 1991లో ‘దళపతి’కి పనిచేశారు. తిరిగి ఇన్నేళ్ల తర్వాత మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 12న రజినీ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్టుపై అధికారికంగా అనౌన్స్‌మెంట్ రావొచ్చని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కమల్ హాసన్‌తో సైతం ‘థగ్ లైఫ్’ ద్వారా 36 ఏళ్ల తర్వాత మణిరత్నం వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే.

News October 6, 2024

ఆంధ్రుల హక్కు ముఖ్యమా.. పొత్తు ముఖ్యమా?: షర్మిల

image

AP: సీఎం చంద్రబాబుకు ఆంధ్రుల హక్కులు ముఖ్యమా, లేదంటే బీజేపీతో పొత్తు ముఖ్యమా అని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ అంశంపై మోదీ, అమిత్ షాను నిలదీయాలని ఆమె డిమాండ్ చేశారు. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని డిమాండ్ చేయాలి. రాష్ట్ర ప్రయోజనాల కంటే పొత్తు ప్రయోజనాలు అంత ముఖ్యమేమీ కాదు’ అని ఆమె పేర్కొన్నారు.

News October 6, 2024

సీఎం రేవంత్ లేఖలో పొరపాటు.. BRS సెటైర్లు

image

TG: CM రేవంత్ ప్రధాని మోదీకి రాసిన లేఖపై BRS సెటైర్లు వేస్తోంది. అందులో నేటి తేది(06.10.2024)కి బదులుగా (07.10.2024) పేర్కొనడం ఇందుకు కారణం. దీంతో పాటు ఆగస్టు 15 వరకు రూ.17,869.22 కోట్లు రుణమాఫీ చేశామని ఈరోజు సీఎం లేఖలో చెప్పగా ఆగస్టు 15న చేసిన ట్వీట్‌లో మాత్రం రూ.31,000 కోట్లు మాఫీ చేశామని పేర్కొన్నారు. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ శ్రేణులు ట్రోల్స్ చేస్తున్నాయి.