News March 11, 2025

LENOVO నుంచి ఫ్లిప్ ల్యాప్‌టాప్!

image

ప్రస్తుతం కొన్ని కంపెనీలు ఫ్లిప్ ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఫ్లిప్ ల్యాప్‌టాప్‌ను తాజాగా లెనోవో కంపెనీ లాంచ్ చేసింది. సాధారణంగా ఇది 13.9 ఇంచుల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. వివిధ అవసరాల కోసం ఫ్లిప్ ఓపెన్ చేస్తే 18.1 ఇంచుల డిస్‌ప్లేగా మారుతుంది. ఇది OLED, 120HZ టచ్ స్క్రీన్‌తో ఉంటుంది. అలాగే 16.9MM మందంతో 1.4 కిలోల బరువు ఉంటుంది. దీని ధరను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.

Similar News

News March 26, 2026

నేటి నుంచి భానుడి భగభగలు

image

TG: నేటి నుంచి భానుడు భగ్గుమంటాడని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 39-41 డిగ్రీలు, హైదరాబాద్‌లో 38-39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. అధిక ఉష్ణోగ్రతలతో వికారాబాద్, సంగారెడ్డి, RR, నారాయణపేట్, ADB, ఆసిఫాబాద్ జిల్లాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు.

News March 26, 2026

పొట్టేళ్లకు ఎండు మేత చాలా ముఖ్యం

image

పొట్టేళ్ల పెంపకంలో పచ్చి మేత కంటే ఎండు మేతే చాలా ముఖ్యమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ పొట్టు, ఉలవ పొట్టు, కంది పొట్టు వంటి చాలా రకాల ఎండు మేతలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొట్టేళ్లు చాలా ఇష్టంగా తింటాయి. దీని వల్ల అవి చాలా ఆరోగ్యంగా ఉంటూ, ఎక్కువ బరువు పెరుగుతాయి. అందుకే పచ్చిమేత కాస్త తక్కువైనా, ఎండు మేతను వెటర్నరీ నిపుణుల సూచనలతో సరైన పరిమాణంలో అందేలా చూసుకోవాలి.

News March 26, 2026

రోజూ కాసేపు హాయిగా నవ్వితే..

image

నవ్వు బెస్ట్ మెడిసిన్ అంటున్నారు వైద్యులు. రోజూ కాసేపు మనస్ఫూర్తిగా నవ్వితే ఫిజికల్, మెంటల్ టెన్షన్లు, ఒత్తిడి, కోపం తగ్గుతాయంటున్నారు. ‘10-15ని.లు నవ్వితే 40 క్యాలరీలు ఖర్చవుతాయి. ఫీల్ గుడ్ హార్మోన్లయిన ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. రోగనిరోధక శక్తి, రక్త నాళాల పనితీరు మెరుగుపడుతుంది. గుండె సమస్యలు, BP తగ్గుతాయి. క్యాన్సర్‌పై పోరాటంలోనూ సాయపడుతుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt