News August 18, 2024
ప్లాట్‌ఫామ్ ఫీజు వసూలు స్టార్ట్ చేసిన ఫ్లిప్‌కార్ట్

ఇతర డెలివరీ యాప్‌ల తరహాలోనే ఫ్లిప్‌కార్ట్ కూడా రూ. 3 ప్లాట్‌ఫామ్ ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. సంస్థకు చెందిన మింత్రా, ఫ్లిప్‌కార్ట్స్ మినిట్స్‌లోనూ వసూలు మొదలైంది. తమ సంస్థ అందించే సేవలు మరింత మెరుగ్గా కొనసాగేందుకు ఈ ఫీజు తీసుకుంటున్నట్లు ఓ ప్రకటనలో సంస్థ వెల్లడించింది. కాగా, జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ వంటివి ఇప్పటికే ప్లాట్‌ఫామ్ ఫీజును కలెక్ట్ చేస్తున్నాయి.
Similar News
News December 18, 2025
RFCL 36పోస్టులకు నోటిఫికేషన్

రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (<
News December 18, 2025
ఇతిహాసాలు క్విజ్ – 100

ఈరోజు ప్రశ్న: ఏ రాక్షస రాజు తన తపస్సు ద్వారా మహావిష్ణువును మెప్పించి, తన శరీరం అన్ని తీర్థాల కంటే పవిత్రంగా ఉండాలనే వరం పొందాడు? చివరికి విష్ణువు పాదం మోపడం ద్వారా ఆ అసురుడు ఏ పుణ్యక్షేత్రంగా మారాడు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 18, 2025
ముర్రా జాతి గేదెల ప్రత్యేకతలు ఇవే

ముర్రా జాతి గేదెలు హర్యానా, పంజాబ్ ప్రాంతాలకు చెందినవి. వీటి శరీరం ముందు భాగం సన్నగా, వెనుక భాగం లావుగా V(వీ) ఆకారంలో ఉంటుంది. దీని వల్ల ఇవి తక్కువ ఆహారం తీసుకొని ఎక్కువ పాలను ఇస్తాయి. ఒక ముర్రా గేదె రోజుకు 14 నుంచి 20 లీటర్ల పాలు ఇస్తుంది. మేలైన జాతి గేదెలు రోజుకు 25-30 లీటర్ల వరకు పాలు ఇచ్చే ఛాన్సుంది. ఒక ఈత కాలంలో ఇవి సుమారు 270-300 రోజులు పాలు ఇస్తాయి. పాలలో వెన్న 7 నుంచి 9 శాతంగా ఉంటుంది.


