News September 9, 2024
ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద పోటు

AP: ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద పెరిగింది. ఎగువ నుంచి 4.50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో 70 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి వదిలేస్తున్నారు. పులిచింతల, మున్నేరు, కట్టలేరు నుంచి వస్తున్న ప్రవాహం బ్యారేజీలో కలుస్తోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 13 అడుగులకుపైగా నీటిమట్టం ఉండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Similar News
News November 17, 2025
ఏపీలో టంగ్స్టన్ తవ్వకాలు.. HZLకు లైసెన్స్

ఏపీలో టంగ్స్టన్ బ్లాక్‌లను కనుగొని తవ్వకాలు జరిపేందుకు హిందుస్థాన్ జింక్ లిమిటెడ్(HZL) సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందినట్లు సంస్థ తెలిపింది. క్రిటికల్, స్ట్రాటజిక్ మినరల్స్ అన్వేషణలో దేశం స్వయంప్రతిపత్తి సాధించడంలో తమ వంతు పాత్ర పోషిస్తామని వెల్లడించింది. లైటింగ్ ఫిలమెంట్లు, రాకెట్ నాజిల్స్, ఎలక్ట్రోడ్లు, రేడియేషన్ షీల్డ్‌ల తయారీలో టంగ్స్టన్ను వాడతారు.
News November 17, 2025
భారతీయ ఉద్యోగికి UAE అత్యుత్తమ బహుమతి!

UAE ఇచ్చే ‘అత్యుత్తమ ఉద్యోగి’ బహుమతిని ఇండియన్ గెలుచుకున్నారు. బుర్జీల్ హోల్డింగ్స్‌లో HR మేనేజర్‌గా అనాస్ కడియారకం(KL) పని చేస్తున్నారు. ఎమిరేట్స్ లేబర్ మార్కెట్ అవార్డ్స్‌లో అత్యుత్తమ వర్క్‌ఫోర్స్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ సాధించారు. ఆయనకు ట్రోఫీ, ₹24L, బంగారు నాణెం, యాపిల్ వాచ్, ఫజా ప్లాటినం కార్డు అందజేశారు. గతంలో కరోనా టైమ్‌లో సేవలకు హీరోస్ ఆఫ్ ది UAE మెడల్, గోల్డెన్ వీసాను అనాస్ అందుకున్నారు.
News November 17, 2025
3,928 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

ఐబీపీఎస్ <


